ఆమె జీతం రూ 18,000 – చదువుకున్నది 12వ తరగతే – బ్యాంకు బ్యాలెన్స్ మాత్రం రూ.16.32 కోట్ల

News

Loading...

ఆమె చదువుకున్నది 12వ తరగతే. అసలు అకౌంటింగే నేర్చుకోలేదు. కానీ అకౌంటెంట్ గా  బాస్ ను భలే బురిడీ కొట్టించింది. ఏకంగా కోట్ల రూపాయలకు టోపీ పెట్టింది. అతని అకౌంటింగ్ బుక్స్ నుంచి రూ.16 కోట్లకు పైగా నగదును దోచేసి, ఆ బ్లాక్ మనీని తెలివిగా పెట్టుబడుల వైపు తరలించింది.  కానీ ఆమె మోసం ఎంతోకాలం నిలువలేదు. చివరికి పోలీసులకు చిక్కింది.  ఈ కేసును విచారించిన ఆమె ఆటకట్టించారు. అరెస్టు చేసి జైలుకు పంపారు.

వివరాల్లోకి వెళ్తే.. 29 ఏళ్ల వృశాలి బమానే, ఓ కంపెనీలో ఏడేళ్లకు పైగా అకౌంటెంట్ గా పనిచేసేది. మొదట కొలీగ్స్ అందరినీ మచ్చిక చేసుకుని తెలివిగా బుట్టలో వేసుకుంది. అనంతరం 2013 నుంచి చాలా కామ్ గా కంపెనీ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.16.32 కోట్ల నగదును తన భర్త, తల్లిదండ్రుల, కుటుంబసభ్యుల అకౌంట్లలోకి మరలించింది. అక్కడితో ఆమె తెలివికి ఫుల్ స్టాప్ పడలేదు. అతి తెలివిగా అక్రమంగా మరలించిన కోట్ల రూపాయలను ఆస్తులుగా మార్చుకుంది. దోచేసిన నగదుతో లగ్జరీ లైఫ్ ను అనుభవించింది. విలాసవంతమైన ఇళ్లను కట్టించుకుంది. ఐదు లగ్జరీ అపార్ట్ మెంట్లను, నాలుగు ఫ్యాన్సీ కార్లను కొనుకుంది. అంతేకాదు డాబు,దర్పం కోసం ఖరీదైన కార్లు, బైకులను గిప్ట్ లుగా  ఇచ్చింది. ఆమె ఎక్కువగా ఈ నగదును ఇంటీరియర్ డిజైన్ కు ఖర్చు చేసింది. అన్ని వెహికిల్స్ కు తన లక్కీ నెంబర్.3777 ను వివిధ ఆర్ టీఓ సెంటర్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.

chudu

బాస్ అకౌంట్లో నుంచి కొట్టేసిన నగదుతో చాలా తెలివిగా పెట్టుబడుల వైపు తరలించిందని ముంబై పోలీసుల పేర్కొన్నారు. దోచేసిన నగదంతా తన ఖాతాల్లో లేదా వేరే దగ్గర ఎక్కడైనా దాచేసి ఉంటుందని తొలుత తాము భావించామని, కానీ ఆ నగదును ఆస్తుల కొనుగోలుకు వినియోగించడం చూసి చాలా షాక్ కు గురయ్యాయని ఆజాద్ మైదాన్ పోలీసులు చెప్పారు. బమానేకు చెందిన ఎనిమిది బ్యాంకు అకౌంట్లను గుర్తించామని, వాటిలో దేనిలో ఈ నగదు దాచలేదని, ఎప్పడికప్పుడూ ఆ మొత్తాన్ని ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసిందని డీసీపీ మనోజ్ కుమార్ శర్మ చెప్పారు.  కేరళ, రాజస్తాన్ వంటి ప్రాంతాలకు కుటుంబసభ్యులతో హెలికాప్టర్ లో షికార్లు కొట్టిందని, విదేశీ టూర్ల కోసం వీసా కూడా దరఖాస్తు చేసుకుంది.  బమానే, ఆమె భర్త సచిన్ విలాసవంతమైన ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు చేసేవారని పోలీసుల విచారణలో బయటపడింది. విచారణలో ఈ సమాచారమంతా బమానే నుంచే రాబట్టినట్టు పేర్కొన్నారు. బమానే పై ఐపీసీ సెక్షన్ 408 కింద కేసు బుక్ చేశామన్నారు. ఆమెకు సంబంధించిన ఆస్తులను పోలీసులు సీజ్ చేయనున్నారు.

Loading...
Loading...

Share This Article

Leave a Reply