క‌రెంట్ షాక్‌కు గురైన వ్య‌క్తుల‌ ప్రాణాలు రక్షించాలంటే ఇలా చేయండి – Must Read

Telugu World

Loading...

విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌రిగ్గా లేక‌ అస్త‌వ్య‌స్తంగా ఉన్నా, వైరింగ్ బాగా లేక‌పోయినా, ఎర్తింగ్ స‌రిగ్గా చేయ‌కున్నా, క‌రెంట్ ఎక్కువైనా, స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోయినా విద్యుత్ షాక్ కొడుతుంది. దీంతో ఆ షాక్ బారిన ప‌డ్డ‌వారు తీవ్ర గాయాల‌కు గుర‌వుతారు. ఎక్కువ సామ‌ర్థ్యం ఉన్న హై టెన్ష‌న్ విద్యుత్ అయితే క్ష‌ణాల్లోనే ప్రాణాలు పోతాయి. అయితే అంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ క‌రెంట్ కాకుండా ఓ మోస్త‌రు క‌రెంట్ షాక్‌కు గురై, అపాయంలో ఉన్న‌వారిని మ‌నం ర‌క్షించుకోవ‌చ్చు. అందుకోసం ఈ కింద ప్రచురించిన కొన్ని సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.

1. క‌రెంట్ షాక్ కొట్టిన వారిని వెంట‌నే ప‌ట్టుకోకూడ‌దు. ఎందుకంటే వారిలో పెద్ద మొత్తంలో క‌రెంటు ప్ర‌వ‌హిస్తుంటుంది. ఇది వారిని ప‌ట్టుకున్న వారికి కూడా పాకేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా వారు ఏదైనా విద్యుత్ వైర్‌ను, స్విచ్‌ను ఇంకా అలాగే ప‌ట్టుకుని షాక్‌కు గుర‌వుతూ ఉంటే వారిని ముందుగా ఆ క‌రెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకోసం అథ‌మ విద్యుత్ వాహ‌కాలైన (non-conductivity items) ఎండిపోయిన క‌ర్ర‌లు, గ్లాస్‌, ర‌బ్బ‌ర్‌, ఆస్బెస్టాస్ వంటి వ‌స్తువులను ఉపయోగించి క‌రెంట్ నుంచి బాధితుల‌ను వేరు చేయాలి.

chudu

2. క‌రెంటు షాక్ వ‌ల్ల ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న వారికి త‌క్ష‌ణ‌మే వైద్య స‌హాయం అందితే వారిని ర‌క్షించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఆంబులెన్సును పిల‌వాలి. లేదంటే వాహనంలో ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించాలి. దీని వ‌ల్ల క‌రెంట్ షాక్ కొట్టిన వారికి అయిన గాయాల‌కు వెంట‌నే చికిత్స ల‌భిస్తుంది. వారు ప్రాణాపాయ స్థితికి వెళ్ల‌కుండా ఉంటారు.

3. క‌రెంటు షాక్ కొట్ట‌డం వ‌ల్ల బాగా కాలిపోయి గాయాలైతే ఆ ప్ర‌దేశాల్లో చ‌ల్ల‌ని నీటితో క‌డ‌గాలి.

4. క‌రెంట్ షాక్ కొట్టిన వారు మూర్ఛ పోతుంటే వారిపై వేడిగా ఉండే బ్లాంకెట్ లేదా కోట్‌ను క‌ప్పాలి. దీంతో వారి శ‌రీర ఉష్ణోగ్ర‌త త‌గ్గుతుంది.

5. విద్యుత్ షాక్ కొట్టిన సంద‌ర్భంలో బాధిత వ్య‌క్తుల‌కు శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోతే కృత్రిమ శ్వాస‌ను నోటితో అందించాలి. ఈ క్ర‌మంలో గుండెపై రెండు చేతుల‌తో ఒత్తుతూ సీపీఆర్ కూడా చేయాలి.

6. వెన్నెముకకు బాగా గాయాలైతే త‌ల‌, మెడ‌ల‌ను క‌ద‌ప‌కుండా ఉండేలా చూసుకోవాలి. దీంతో న‌ష్టాన్ని కొద్దిగా నివారించ‌వ‌చ్చు.

7. షాక్ కొట్ట‌డం వ‌ల్ల గాయాలై ర‌క్త‌స్రావం జ‌రుగుతుంటే శుభ్రమైన గుడ్డ‌తో గాయాల‌కు క‌ట్టు క‌ట్టాలి. దీంతో బ్లీడింగ్ ఆగుతుంది.

 

Loading...
Loading...

Share This Article

Leave a Reply