టెలిఫోన్‌ ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Jobs

Loading...

టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు ఎందుకు?
ముఖాముఖి తేల్చుకోకుండా ఫోన్‌లో ఏమిటని అనుమానం వేధిస్తోందా? దానికి కొన్ని కారణాలున్నాయి.
 • ప్రాథమికంగా అంచనాకు రావడానికి టెలిఫోన్‌ ఇంటర్వ్యూ చాలు.
 • ముఖాముఖి నిర్వహించడానికి సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు విదేశాల్లోనో, మీకు సుదూర ప్రాంతంలోనో ఉన్న సంస్థ ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించాలంటే మీరు లేదా సంస్థ అయినా భరించాలి. కొన్ని సందర్భాల్లో ఇది ఆచరణ సాధ్యం కాదు.
 • అభ్యర్థులు ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ విధానం సులభం. కేవలం సీవీ ద్వారా అంచనాకు రావడం కష్ట అని భావించిన సందర్భంలో… అభ్యర్థి గురించి మరింత అవగాహనకు రావడానికి ఈ పద్ధతి అవసరం.
 • ఉద్యోగ స్వభావం టెలిఫోన్‌ సంభాషణలతో కూడుకుని ఉన్నప్పుడు ఇది తప్పనిసరి. ఉదాహరణకు టెలీ మార్కెంటింగ్‌, కస్టమర్‌కేర్‌, కాల్‌ సెంటర్‌, బీపీవో ఉద్యోగాల్లో అభ్యర్థి టెలిఫోన్‌లో ఎలా మాట్లాడుతున్నారో గమనించడం అవసరం.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • టెలిఫోన్‌ ఇంటర్వ్యూను కూడా ముఖాముఖి ఇంటర్వ్యూలానే భావించండి.
 • ఏ విధమైన అంతరాయం కలగని విధంగా ఏర్పాట్లు చేసుకోండి. ఫోన్‌ బాగా పనిచేస్తోందో లేదో.. ఒకటికి రెండు సా ర్లు సరిచూసుకోండి. ముందుగా ట్రైల్‌ టెలిఫోన్‌ ఇంటర్వ్యూ నిర్వహించమని మీ స్నేహితులను కోరండి. మీ స్వరం.. ఉచ్ఛారణ తదితర అంశాల్లో లోటుపాట్లు చెప్పమని కోరండి.
 • బయోడేటా, కవర్‌లెటర్‌, ధ్రువీకరణ పత్రాలు, సదరు సంస్థ గురించి సేకరించుకున్న సమాచారం దగ్గరే పెట్టుకోండి.

మీ బలహీనతలు ఏమిటి..?

chudu

 • ఏమీ లేవు అని చెప్పారం టే.. మీరు అబద్దం చెప్పినట్టు ఇట్టే తెలిసిపోతుంది. బలహీనతలు లేని మనిషి ఉం డడు. మరీ ప్రతికూలాంశాలను చెప్పకుండా, మీరు ని యంత్రించుకోగల బలహీనతలను మాత్రమే చెప్పండి. వాటిని అధిగమించడానికి మీరు చేస్తున్న ప్రయాత్నాల గురించి చెప్పండి. ఈ ప్రశ్న అడగడంలో ఉద్దేశం కేవలం మీ బలహీనతల గురించి తెలుసుకోవడం ఒక్కటే కాదు. మీరు ఎంత నిజాయితీగా వ్యవహరిస్తారని అంచనా వేయడానికే. సమయపాలన పాటించకపోవడం మీ బలహీనత అనుకోండి… దాని గురించి ప్రస్తావించి, అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించండి.
 • మీ పని అనుభవం, అర్హతలను వివరించమని అడగవచ్చు. వీలయినంత వరకు సీవీలో పేర్కొన్న వాటిని కాకుండా వాటిని బలపర్చే మరికొన్ని విషయాలను చెప్పండి ఈ ప్రశ్న ఊహించి, అందుకనుగుణంగా సాధన చేయండి.

ఈ సూచనలను పాటిస్తే చాలు..

 • సమాధానాలు సూటిగా, స్పష్టంగా ఉండాలి. ఎక్కువ జాతీయాలు, మాండలిక ప్రయోగాలు వాడొద్దు. ప్రశ్నలను జాగ్రత్తగా వినడం ముఖ్యం.
 • తెలియని విషయాలను తెలియదు.. అని క్లుప్తంగా చెప్పడం కం టే.అవిఎందుకు తెలుసుకోలేకపోయారో చెబితే ప్రయోజనం ఉంటుంది.
 • మీ గురించి చెప్పమన్నప్పుడు రెజుమ్‌/కర్రికులమ్‌ వీటేలో ప్రస్తావించిన అంశాల గురించే చెప్పండి. అందు లోని అంశాలను ధ్రువపరిచేవిగా ఉండాలి. ఖండించేలా ఉండకూడదు.
 • టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి. ముఖాముఖి అయితే ఒకరి ముఖ కవళికలు మరొకరికి తెలుసుస్తాయి. దాన్ని బట్టి సమా ధానాలు చెప్పేటప్పుడు జాగ్రత్త పడడానికి అవకాశముంటుంది. కెరీర్‌లో ఎంతో ప్రాధాన్యమున్న అంశం ఆత్మవిశ్వాసం. అభ్యర్థిలో తొణికిసలాడే ఆత్మవిశ్వాసాన్ని టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉండదు. ఇంటర్వ్యూ చేసేవారు మీ తడబాటు ను గమనించినట్లయితే మిమ్మల్ని పక్కనబెట్టే అవకాశం ఉంది.

సంభాషణ ఎలా ఉండాలి?

 • సంభాషణను ప్రారంభించేముం దు మీపేరును పూర్తిగా చెప్పి… విష్‌ చేయండి.
 • డొంక తిరుగుడు, తప్పించుకునే ధోరణిలో సమాధానాలు ఉండకూడదు. మీకు తెలియకపోతే ‘తెలియదు’ అని చెప్పండి. అయితే దానికి కొసాగింపుగా తెలుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పండి.
 • ప్రశ్నకు సమాధానాన్ని ఎక్కడ మొదలుపెట్టాలి. ఎక్కడ ఆపాలి. అన్న విషయమై అవగాహన ఉండాలి. నాన్‌స్టాప్‌గా మాట్లాడొద్దు. ప్రశ్నలను జాగ్రత్తగా వినండి. మధ్యలో అడ్డుతగలవద్దు. అర్థం కాకపోతే మరోసారి అడగండి.
 • ఇంటర్వ్యూ ముగించే ముందు సందేహాలు ఉంటే అడగండి అని సంస్థ ప్రతినిధి కోరతారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకున్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోండి. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకండి.
 • ప్రామాణిక ఇంగ్లీష్‌ భాషనే ఉపయోగించండి. మండలికాలను, జాతీయాలను ఉపయోగించవద్దు.
 • ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. ఎటువంటి ఒత్తిడికి లోనుకావద్దు. మీ మానసికస్థితి సంభాషణలో ప్రతిఫలిస్తుందని గమనించండి.

సాధారణంగా అడిగే ప్రశ్నలు..

Tell me about your Self ?
What do you know about our company ?
What are you looking for ?
What are your Strengths ?
వృత్తికి, అనుభవానికి, అర్హతలకు సంబంధించిన ఈ ప్రశ్న అడిగారు అని మీకు స్పష్టంగా తెలిసినప్పుడు… మీ బలాలను స్పష్టంగా చెప్పండి. మీరు సాధించిన విజయాల గురించి, మీ సామర్థ్యం గురించి చెప్పండి. ఉద్యో గానికి సంబంధించిన లక్షణాలు అయి ఉంటే మంచిది. లేని పక్షంలో మీ వ్యక్తిత్వం తాలూకు సానుకూల అంశాలు మాత్రమే చెప్పండి. ఉదాహరణకు కష్టపడి పనిచేస్తాను. నిబద్ధతతో వ్యవహరిస్తాను. సమయపాలన పాటిస్తాను తదితర అంశాలను ప్రస్తావించండి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply