మంచినేళ్లే మహా ఔషధం

News

Loading...

పంచభూతాల్లొ ఒకటి, ప్రకృతి సహజ సిద్ధంగా లభించే వనరుల్లొ ప్రధానమైనది. జీవన మనుగడకు అత్యంత అవసరమైనది నీరు. అందరూ ఉపయోగించే నీటివల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో కలుషితమైన నీటిని వాడాలి. ప్రవాహం లేకుండా నిల్వ ఉండే చెరువులు, కుంటల్లో నీటిని వంటచేయడానికి, తాగడానికి ఉపయోగించ కూడదంటారు. అలాగే ట్యాంకులలో ఎక్కువ కాలం నిల్వ ఉండే నీటిని వాడకూడదు. నిత్యావసరాలకు ఉపయోగించడమే కాకుండా చిన్నచిన్న ఆరోగ్య రుగ్మతలను కూడా స్వచ్చమైన నీటివల్ల తొలగించుకోవచ్చు. రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడంవల్ల శరీర అంతర్భాలలోని మలినాలు బయటకు విసర్జించబడతాయి.

ప్రతి రోజూ పరగడుపున రాగి చెంబులోని నీటిని రెండు గ్లాసులు తాగితే జీర్జశక్తి పెరుగుతుందని అది మలబద్ధకం నివారణకు మంచిదని అంటారు. మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులను అధిక నీరు తాగడం వల్ల తగ్గించుకోవచ్చు. వేడి నీటిలో ఉప్పు వేసుకొని ఆ నీటిని పుక్కిటపడితే గొంతు, టాన్సిల్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply