టూత్‌పేస్ట్ వాడే వాళ్లకు తెలియాల్సిన అసలు విషయమిది ! అందరు తప్పకుండా చదవండి

Other

Loading...

ఈ ప్రపంచంలో ఏదీ వృధాగా పోదు. ప్రతీదాని వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడమే కష్టం. దానికి కారణం నిర్లక్ష్యం. దీనివల్ల ఏం ఉపయోగముంటుందిలే అనే అశ్రద్ధ. అందువల్లే చాలా వస్తువులు ఎన్నో ఉపయోగాలున్నప్పటికీ ఎందుకూ పనికిరాకుండా మట్టిలో కలిసిపోతున్నాయి. అలాంటిదే టూత్‌పేస్ట్. టూత్‌పేస్ట్ అంటే చాలామంది పళ్లు తోముకోవడానికి మాత్రమే పనికొస్తుందనుకుంటారు. నిజమే టూత్‌పేస్ట్‌తో పళ్లే తోముకుంటారు. కానీ టూత్‌పేస్ట్ వల్ల మరెన్నో లాభాలున్నాయన్న విషయం చాలామందికి తెలియదు. వాడుకోవాలే కానీ ఎన్నో రకాలుగా ఈ టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది.
అందులో ముఖ్యంగా యువతకు. చాలామంది యువతీయువకులను ప్రధానంగా వేధించే సమస్య మొటిమలు, మచ్చలు. వీటి నుంచి ముఖాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోతుంటారు. కానీ ఇంట్లోనే ఉన్న టూత్‌పేస్ట్ వల్ల మొటిమలు తగ్గుతాయని మాత్రం గుర్తించరు. టూత్‌పేస్ట్ వల్ల మొటిమలు తగ్గడమేంటని ఆశ్చర్యపోకండి. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ముఖం మీద ఎక్కడైతే మచ్చలు, మొటిమలు ఉన్నాయో ఆ స్థానంలో రాత్రి పడుకోబోయే ముందు టూత్‌పేస్ట్ అప్లై చేసి చూడండి. వారం రోజులు ఇలా చేస్తే తప్పకుండా మీరు మార్పును గమనిస్తారు. కేవలం ఈ ఒక్కటే కాదు.
టూత్‌పేస్ట్ వల్ల మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు ఉపయోగపడే అంశం మరొకటి ఉంది. వంట చేయడానికి ఇల్లాలు ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిరపకాయలు ఇలాంటి ఎన్నో ఘాటైన పదార్థాలను కోస్తుంది. వీటితో పాటు చికెన్, కోడిగుడ్లు లాంటి నీసు పదార్థాలతో కూడా బానే పని ఉంటుంది. ఇవన్నీ చేతితో తాకడం వల్ల వాటి ఘాటు వాసన అంత త్వరగా వదిలిపోదు. హ్యాండ్ వాష్‌, సోప్‌లు వాడినా ఎంతోకొంత వాసన వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్లు టూత్‌పేస్ట్‌తో చేతులను కడుక్కుంటే అస్సలు ఆ తర్వాత వాసనే రాదట. గ్లాస్ వస్తువులను క్లీన్ చేయడానికి టూత్‌పేస్ట్ బాగా ఉపయోగపడుతుందట. చాలామందికి తెలియని విషయమేమిటంటే, చేతికుండే గోర్లు… నోట్లో పళ్లు ఒకేరకమైన కణాలతో తయారయి ఉంటాయి. లేడీస్ మ్యానిక్యూర్, పెడిక్యూర్ పద్దతుల్లో ఒక్కసారి టూత్‌పేస్ట్ వాడి చూస్తే మంచిది. ఖర్చు, సమయం రెండూ ఆదా చేయొచ్చు. గోడలకు బంకగా కూడా టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply