చుండ్రు తగ్గించుకోండి ఇలా..!!

Telugu World

Loading...

మనిషి జుట్టు కోసం ఎంత కేర్ తీసుకున్నా చలికాలం మాత్రం చుండ్రు సమస్యతో విపరీతంగా బాధపడతారు. చుండ్రు ఉండటం వల్ల జుట్టు దురద పెట్టడం..చికాకు అనిపించడం లాంటి జరుగుతుంటాయి. అంతే కాదు తెల్లగా పొడి పొడి గా రాలుతూ అసహ్యంగా కనిపిస్తుంది. పదిమందిలో తిరగాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. జుట్టు బలహీనంగా తయారై రాలిపోవడమే కాదు.. మన నుంచి ఇతరులు దూరంగా పారిపోయేలా చేస్తుంది. డాండ్రఫ్ షాంపూలు ప్రకటనల్లో చూపించినంత ప్రభావం నిజంగా చూపించవు. మరి డాండ్రఫ్ పోవాలంటే ఏం చేయాలి? కొన్ని చిట్కాలు పాటిస్తే చుండ్రు గుడ్బై చెప్పేసి వెళ్లిపోవడం ఖాయం. ఆ చిట్కాలేంటో చూద్దాం పదండి.

పూదీన ఆకుల్ని మెత్తగా రుబ్బి, కాసిన్ని నీళ్ళను కలిపి, మాడుకి పట్టించి ఒక గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రిని తగ్గించుకోవచ్చు.

chudu

గోరువెచ్చటి కొబ్బరినూనెను రాత్రిపూట జుట్టు కుదుళ్ళకు మర్దనా చేయాలి. ఇలా ఒక మూడు రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ముదురు వేపాకుల్ని మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించాలి. ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమ పాళ్ళలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. కాస్త గట్టి పడ్డాక తలకు షాంపూలా వాడుకోవాలి. గుడ్డులో ఉండే తెల్లసోనని జుట్టుకి పట్టించి గంటతర్వాత స్నానం చేయాలి.

ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. మిశ్రమం దగ్గరికి వచ్చాక షాంపూలా వాడితే మంచి ఫలితం ఉంటుంది. గసగసాలను మెత్తటి పేస్ట్‌లా చేసుకుని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.

ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి.. కాసేపాగి తలస్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది.

మందారాకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తీరుతంది. కుదుళు బలంగా అవుతాయి. కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.

పారిజాతం గింజలను మెత్తగా నూరి దాన్ని నూనెలో కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకోవాలి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply