పక్షవాతానికి శతృవు పాలకూర

Telugu World

Loading...

మనకు వచ్చే రోగాలన్నింటికీ ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కూరగాయలు, ఆకుకూరలే నివారణిగా పనిచేస్తాయంటే అతిశయోక్తి కాదు. ఈ విషయం ఎననడో రుజువైనప్పటికీ తాజాగా హైపర్‌టెన్షన్‌ (హైబీపీ) వలన ఏర్పడే పక్షవాతాన్ని నివారించడంలో పాలకూర బాగా పనిచేస్తుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అధ్యయన వివరాలు ‘ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ అసోసియేషన్‌’ అనే మెడికల్‌ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.దానిప్రకారం శాస్త్రవేత్తలు హైబీపి ఉన్న 20,702 మందిపై సర్వే నిర్వహించినట్టు తెలిసింది. హైబీపీని తగ్గించే ఎనాలప్రిల్‌ అనే మందును వాడుతున్న వారికి మందుతోపాటు ఫోలిక్‌యాసిడ్‌ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని అందించారు. ఫోలిక్‌యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్న వారిలో గుండెపోటు వచ్చేందుకు అన్నివిధాల రిస్క్‌ ఉన్నవారే. అయినప్పటికీ దీనివల్ల అలా వచ్చే అవకాశాలు 21 శాతం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గాయని వారు చెప్తున్నారు. అదేవిధంగా 40 ఏళ్ల వయస్సు దాటినవారు ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వలన అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని వారు చెప్తున్నారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply