దర్శకనిర్మాతలతో శృంగారం చేస్తేనే అవకాశం ఇస్తామని అన్నారట నటి సంచలన మాటలు

News

Loading...

“Casting Couch” .. ఈ పదంతో ఇక్కడ ఎంతమందికి పరిచయం ఉందో తెలియదు కాని, తెలియని వారికి చెప్పేదేంటంటే, అవకాశమనిస్తామని చెప్పి, శృంగారంలో పాల్గొనమని లేక, నగ్న నృత్యాలు చేయమని డిమాండ్ చేయడం, దీని అర్థం. బయట జనాలు మాట్లాడుకున్నట్లుగా సినిమా ఇండస్ట్రీ ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాని సినిమాల్లో ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు అని అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే.

ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, అవకాశం ఇస్తాం కాని నిర్మాత, దర్శకుడితో సెక్సువల్ రిలేషన్ షిప్ పెట్టుకోవాలి అనే డిమాండ్ తన జీవితంలో మూడు సార్లు విన్నానని కన్నడ సినిమాలు చేస్తున్న ప్రియాంక ఎమ్ జైన్ కొన్ని చేదు అనుభవాలను బయటపెట్టింది.

chudu

“కన్నడ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. ముంబై నుంచి వచ్చిన అమ్మాయిలు దేనికైనా సిద్ధంగా ఉంటారని వాళ్ళు అనుకుంటారు. కేవలం ఎక్సుపోజింగ్ వరకే కాదు, వాళ్ళతో సెక్స్ సంబంధాలు పెట్టుకోవాలని అడుగుతారు. నా తల్లిదండ్రులకు ఈ విషయం చెబితే వాళ్ళు కంగారు పడ్డారు. కాని ఇండస్ట్రీలో అందరు అలానే ఉండరు అని వాళ్ళకి నచ్చజెప్పాను. ఇది చాలా కామన్ విషయమని, సినిమాల్లోనే కాదు, బయట వేరే అవకాశల కోసం అమ్మాయిలు ఇలాంటివి చూడకతప్పదని, నేను ఒక్కసారి నిలదొక్కుకున్నాక ఇలాంటివి అడిగే ధైర్యం ఉండదని వారికి అర్థమయ్యేలా చెప్పి, అలాంటి డిమాండ్లతో వచ్చిన మూడు సినిమాల్ని వదిలేసాను. నా ఆత్మగౌరవాన్ని నేను కోల్పోలేను. కొంతకాలం ఎదురుచూసాక గోలిసోడా చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ యూనిట్ లో అందరు పనిమంతులు, మంచివాళ్ళు. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ ఓ ప్రముఖ బెంగళూరు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ప్రియాంక.

Loading...
Loading...

Share This Article

Leave a Reply