ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రోడ్ల పై బిచ్చమెత్తుకున్నావ్యక్తి , ఇప్పుడు కేంబ్రిడ్జి యూనివర్సిటీ పట్టభద్రుడయ్యాడు.

Get Inspired

Loading...

ఆదరించి అక్కున చేర్చుకునే వారు. తగిన ప్రోత్సాహం అందించి ముందుకు నడిపించే వారు. ఉండాలే గానీ ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా అద్భుతాలు చేసి చూపించగలుగుతారు. దానికి ఎలాంటి అంశాలు కూడా ప్రతిబంధకాలు కావు. సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపించాడు మరో యువకుడు. చిన్నతనంలో రోడ్లపై బిచ్చమెత్తుకున్న అతనే నేడు ఓ అత్యున్నత యూనివర్సిటీలో పట్టభద్రుడై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సరైన ఆదరణ, ప్రోత్సాహం ఉండాలే గానీ తమ లాంటి వారిలోనూ ప్రతిభ చాటే వారు చాలా మందే ఉంటారని చాటి చెప్పాడు ఆ యువకుడు.

అతని పేరు జయవేలు. ఉంటోంది నెల్లూరు జిల్లా. తండ్రి లేడు. తల్లి మాత్రమే ఉంది. అప్పటికి జయవేలు ఇంకా పసిపిల్లాడే. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఏర్పడిన కరువు కారణంగా వారికి తినడానికి తిండి కూడా కరువైంది.

chudu

దీంతో ఆ తల్లీకొడుకు ఇద్దరూ సమీపంలోనే ఉన్న చెన్నై నగరానికి వలస వెళ్లారు. అక్కడ ఏదైనా పని దొరికితే కడుపు నింపుకోవచ్చని వారి ఆశ. కానీ అది అడియాశే అయింది. ఏ పని దొరక్కపోవడంతో వారి బతుకు ఇంకా దుర్భరమైంది. దీంతో జయవేలును అతని తల్లి బిచ్చమెత్తుకు రావాలని రోడ్లపైకి పంపించేది. ఈ క్రమంలో జయవేలు అక్కడా ఇక్కడా యాచన చేసి నాలుగు రూపాయలు తెచ్చేవాడు. అయితే వాటిని అతని తల్లి మద్యం తాగడం కోసం ఖర్చు పెట్టేది. దీంతో జయవేలుకు తిండి సరిగ్గా దొరికేది కాదు. అతను ఎంతగానో ఏడ్చేవాడు.

కాగా ఒకానొక సందర్భంలో చెన్నైలోనే నివాసం ఉండే ఉమ, ముత్తురామన్ అనే దంపతులు భిక్షగాళ్ల జీవితంపై డాక్యుమెంటరీ తీయడానికని బయల్దేరి చెన్నైలో రోడ్ల వెంట తిరగసాగారు. ఈ క్రమంలో జయవేలు వారి కంట పడ్డాడు. తిండి సరిగ్గా దొరక్క ఏడుస్తున్న జయవేలును వారు దగ్గరకు తీసుకుని ఆదరించారు. తాము నడుపుతున్న సెల్ఫ్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ పేరిట జయవేలును అక్కున చేర్చుకుని అతనికి విద్యాబుద్ధులు నేర్పించారు. స్కూళ్లో చేర్పించారు. చక్కని తిండి కూడా పెట్టేవారు. దీంతో జయవేలు చెన్నైలోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఎల్లప్పుడూ చదువుల్లో ముందుండేవాడు. కాగా అతని ప్రతిభను గుర్తించిన ఉమ, ముత్తురామన్‌లు అతన్ని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేర్పించారు. దీంతో అతను అక్కడే తన డిగ్రీ విద్యను విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం మరో ప్రముఖ యూనివర్సిటీలో ఇప్పుడు పీజీ చదువుతున్నాడు. ఇదంతా ఉమ, ముత్తురామన్‌ల చలువే. అయినా వారి కష్టాన్ని, ప్రోత్సాహాన్ని జయవేలు వృథా కానివ్వలేదు. తానూ కష్టపడి చదివాడు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లోనూ ప్రతిభ చూపగల సమర్థులు ఉంటారని నిరూపించాడు. ప్రోత్సహిస్తే ఇంకా పెద్ద చదువులు చదివేందుకు కూడా వెనుకాడనని అతను చెబుతున్నాడు. అయితే ఒక్క జయవేలు మాత్రమే కాదు, ఇంకా ఇలాంటి ఎంతో మంది విద్యా కుసుమాలు మన సమాజంలో చాలా మందే ఉన్నారు. వారందరినీ ఆదరించి ప్రోత్సహిస్తే అప్పుడు దేశం ఇంకా ప్రగతి పథంలో ముందుకు వెళ్తుంది. ఏమంటారు. అంతే కదా..!

Loading...
Loading...

Share This Article

Leave a Reply