కొత్త 2000 రూపాయిల నోట్ మీద మోడీ స్పీచ్ … ఇది ఎంత వరకు నిజమో తెలుసుకోండి

News

Loading...

మీరు కొత్త 2వేల రూపాయ‌ల నోటును మొబైల్‌తో స్కాన్ చేసి చూశారా..? అయితే, ఇప్పుడే చేసి చూడండి. అందులో మీకు 2వేల రూపాయ‌ల నోటే క‌నిపిస్తోందా..? కానీ, కొంద‌రికి మోదీ వీడియో ప్ర‌సంగాలు వ‌స్తున్నాయ‌ట‌. ఇదేంటి అనుకుంటున్నారా…? ఇందులోనే ఉంది అస‌లు లాజిక్ అంతా..!
మోదీకి నోట్‌… ఇది ఒక ఆండ్రాయిడ్ యాప్‌. 2వేల రూపాయ‌ల నోటు ఆధారంగా ఇది ప‌నిచేస్తుంది. నోటు లేదా దానిపై ఉన్న మంగ‌ళ‌యాన్‌ని ఈ యాప్‌తో స్కాన్ చేస్తే వెంట‌నే మోదీ స్పీచ్ వ‌స్తుంది. నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్‌తో ఈ యాప్ ఇప్పుడు సోష‌ల్ మీడియా, మెసెంజ‌ర్‌లలో చ‌క్క‌ర్లు కొడుతోంది. రీసెంట్‌గా కొంద‌రు కొత్త 2వేల నోటును నీళ్ల‌లో త‌డిపి దాని క్వాలిటీని టెస్ట్ చేశాడు. ఆ వీడియో నెట్‌లో బాగా ప్ర‌చారం పొందింది. తాజాగా ఈ నోటుపై బెంగ‌ళూరుకి చెందిన బ‌ర్రా స్క‌ల్ స్టూడియోస్ ఈ నోటుపై ప్ర‌యోగం చేసింది.
ఈ నోటును స్కాన్ చేస్తే..

ఈ నెల 8వ తేదీన మోదీ చేసిన ప్ర‌సంగం వ‌చ్చేలా ఈ ఆప్‌ని చేసింది. ఒక్క మోదీనే కాదు… చిన్న చిన్న సాంకేతిక మార్పుల‌తో మ‌న ఓన్ వీడియోలు కూడా వ‌చ్చేలా మార్చుకోవ‌చ్చ‌ట‌. ఈ యాప్‌తో ఆ బెంగ‌ళూరుకి మంచి ఆఫ‌ర్‌లు వ‌స్తాయ‌ని భావిస్తోంది. అంతేత‌ప్ప‌, 2వేల నోటును స్కాన్ చేస్తే మోదీ వీడియోకి లింక్ లేదు.. ఆ యాప్ ఉంటే త‌ప్ప‌.. ఈ క్రింది వీడియో లో చూడండి..

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply