శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు జియో శుభవార్త

Gadgets

Loading...

సంచలనం సృష్టిస్తున్న రిలయెన్స్ జియో ఆఫర్లు కేవలం లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకే కాదట.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కస్టమర్లు కూడా ఈ ఆఫర్లను పొందొచ్చట. రూ.200లతో సిమ్ కొనుకున్న వారికి 75జీబీ 4జీ డేటా.. 4500 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యం వంటి ఊరించే ఆఫర్లతో ఈ ఆగస్టులోనే కమర్షియల్ గా వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న రిలయెన్స్ జియో, శాంసంగ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో జియో ప్రీవ్యూ ఆఫర్ తో స్మార్ట్ ఫోన్ ను ఎంపికచేసుకునేలా శాంసంగ్ ఓనర్లకు రిలయెన్స్ అందుబాటులో ఉండనుంది. లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకే ఇప్పటివరకూ ఈ సిమ్ ఆఫర్ ప్రకటించిన రిలయెన్స్, మొదటిసారి ఒక స్మార్ట్ ఫోన్ తయారీదారితో తన భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.

ఉచిత వాయిస్ సదుపాయంతో పాటు మూడు నెలల ఉచిత అన్ లిమిటెడ్ డేటా, ఎస్ఎమ్ఎస్ ఆఫర్లతో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ రిలయెన్స్ జియో సిమ్ ను పొందవచ్చు. అంతేకాక మూవీస్, బుక్స్, మ్యూజిక్ ను జియో యాప్స్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త శాంసంగ్ కస్టమర్లకూ.. ఈ ఆఫర్ తో కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు మాత్రమేనని రిపోర్టులు తెలిపాయి.
రిపోర్టుల ప్రకారం…శాంసంగ్ గెలాక్సీ ఏ5,ఏ7, ఏ8, నోట్ 4, నోట్ 5, నోట్ ఎడ్జ్, ఎస్6, ఎస్6 ఎడ్జ్, ఎస్6 ఎడ్జ్ ప్లస్, ఎస్7, ఎస్7 ఎడ్జ్ లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల యూజర్లు జియో ఆఫర్లను పొందాలనుకుంటే, మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియో కనెక్షన్ కోసం “గెట్ జియో సిమ్” ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ తో బార్ కోడ్ కలిగిన కూపన్ ను కస్టమర్లు పొందుతారు. చివరికి రిలయెన్స్ డిజిటల్ స్టోర్ లో ఫోన్ తో పాటు వెళ్లి, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి ఈ సిమ్ ను తీసుకోవచ్చు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply