విమానాల్లో శాంసంగ్ కంపెనీ ఫోన్లను అనుమతించేది లేదు… ఎందుకో తెలుసా

News

Loading...

డేంజర్ బెల్స్ మోగించిన శాంసంగ్… వెంటనే తమ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చెయ్యమని వార్నింగ్ ఇస్తుంది. శాంసంగ్ కంపెనీ ఊహించని చిక్కుల్లో పడింది. శాంసంగ్ కంపెనీ తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవరూ వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసేయాలని లేకుంటే మీరు ప్రమాదంలోచిక్కుకుంటారని చెబుతోంది. కంపెనీ తన ఫోన్లను రీకాల్ చేసి కొత్త ఫోన్లు ఇచ్చినప్పటికీ సమస్య తీవ్రం కావడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను ఆపేశారు.  కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నాయి.

అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది. వెంటనే ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని శాంసంగ్ ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటికి తెలియజేసింది. వినియోగదారులు ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా, మార్చుకున్నది ఉన్నా కూడా దాన్ని వెంటనే స్విచాఫ్ చేసేయండి. ఆ ఫోన్ వాడకండి” అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో అందరూ ఎలెర్ట్ గా ఉంటె మంచిది. మీకు తెలిసిన ఈ విషయం అందరికి చెప్పి ఎలెర్ట్ చెయ్యండి. ఫోన్లు పేలితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ఈ మద్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply