రకూల్ లోటస్ పాండ్‌కు ఎందుకెళ్లింది…

Movies

Loading...

అందంతో పాటు బుర్రున్న అతి తక్కువ మందిలో రకుల్ ఒకరు. వరుస హిట్లతో..పెద్ద హీరోల పక్కన..పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూనే వ్యాపారం మొదలుపెట్టింది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో మంచి జోరు మీద ఉన్న తార రకుల్ ప్రీత్ సింగ్. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ స్టార్ హీరోల సరసన నటిస్తూ, దూసుకెళుతోంది. తన మీద ఉన్న క్రేజ్ ని చక్కగా క్యాష్ చేసుకుంటోంది. ఈ మధ్యే ఫిట్ నెస్ స్టూడియో పెట్టిన ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడు ఒక ఇంటిదయిపోయింది.

రకుల్ ఒక ఇంటిదయ్యింది అంటే…పెళ్లి చేసుకొని అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే… కథానాయికగా కోట్లు సంపాదిస్తున్న రకుల్ 3 కోట్ల రూపాయలు పెట్టి, ఇల్లు కొనుక్కుందట. ఆ ఇల్లు ఉన్నది లోటస్ పాండ్ ఏరియాలో. వై.ఎస్.ఆర్.సి.పి. అధినేత వై.ఎస్. జగన్ ఇల్లు ఉన్నది కూడా అక్కడే అనే విషయం తెలిసిందే. రకుల్ కొన్న మూడు కోట్ల ఇంటి గురించి చెప్పాలంటే.. మూడు పడక గదుల ఇల్లది. త్వరలో ఈ ఇంట్లోకి మారబోతోంది రకుల్..

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply