ఉద్యోగం మానేసి సోషల్‌ మీడియా సైట్లుతో కోట్లు గడిస్తున్నాడు

Get Inspired

Loading...

ప్రస్తుతం సోషల్‌ మీడియా అనేది చాలామంది దైనందన జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా సైట్లు వ్యక్తుల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే చాలామంది గంటల తరబడి వాటితోనే కాలం వెల్లదీస్తుంటారు. ఓ యువకుడు సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడపడం కోసం తన ఉద్యోగానికే రాజీనామా చేశాడు. కానీ, ఆ నిర్ణయమే అతనికి కోట్లు కురిపిస్తోంది.
సోషల్‌ మీడియా అంటే ప్రాణం ఇచ్చే 29 ఏళ్ల యువకుడు క్రిస్‌ సాంచే. ఆసక్తికర విషయాలను స్నేహితులతో పంచుకోవడం అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే అతనికి ఫాలోవర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా అధిక సమయం సోషల్‌ మీడియాలో గడపడం కోసం ఉద్యోగం కూడా వదులుకున్నాడు క్రిస్‌. కొన్ని రోజుల తర్వాత ‘ఉబర్‌ ఫ్యాక్ట్స్‌’ పేరుతో ఓ ఖాతా తెరిచి అందులో అత్యంత ఆసక్తికర విషయాలను పోస్ట్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో అతని ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లతో కలిపి క్రిస్‌ ఫాలోవర్ల సంఖ్య కోటీ ఎనభై లక్షలు. ఆ ఫాలోయింగే క్రిస్‌కు కోట్లు తెచ్చిపెడుతోంది.

కొన్ని వెబ్‌సైట్లు, పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వెబ్‌సైట్లు కొంత ఆసక్తికర సమాచారాన్ని క్రిస్‌ అకౌంట్లో పెడతాయి. పూర్తి సమాచారం కావాలంటే క్లిక్‌ చేయండి అంటూ తమ సైట్‌ అడ్రస్‌ ఇస్తాయి. అలా ఎంత మంది క్రిస్‌ అకౌంట్‌ నుంచి సదరు వెబ్‌సైట్లకు మళ్లుతున్నారో లెక్కగట్టి అంత డబ్బు క్రిస్‌కు అందిస్తాయి. ఇక పలు ఉత్పత్తి సంస్థలు క్రిస్‌ అకౌంట్లో తమ ప్రకటనలు పెట్టుకుని డబ్బులు చెల్లిస్తాయి. ఇలా పలు మార్గాల ద్వారా క్రిస్‌ ఏడాదికి మూడు కోట్ల రూపాయలపైనే సంపాదిస్తున్నాడు. మొత్తానికి ఉద్యోగాన్ని వదిలి సాహసం చేసిన క్రిస్‌ తనకు ఇష్టమైన రంగంలోనే డబ్బులు సంపాదిస్తున్నాడు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply