బ్యాంకులలో పాతనోట్ల మార్పిడి బంద్ – కేవలం ఇక్కడ మాత్రం మార్చుకోవచ్చు

Telugu World

Loading...

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం పలు నిర్ణయాలు వెలువరించింది. బ్యాంకులలో నోట్ల మార్పిడిని గతంలో ప్రకటించినట్లుగానే బుధవారంతో ఆపేసింది. ఇప్పటికే ఈ తరహా మార్పిడి కోసం బ్యాంకులలో క్యూలైన్లు తగ్గుతున్నాయని, అందువల్ల ఇప్పటివరకు అసలు బ్యాంకు ఖాతాలు లేనివారు ఖాతాలు తెరుచుకోడానికి, అలాగే తమవద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడానికి వీలుగా బ్యాంకులలో రద్దీ తగ్గించాలన్న ఉద్దేశంతో పాతనోట్ల మార్పిడిని 24వ తేదీ తో ఆపేస్తున్నామని ప్రకటించింది. ఇక పాత 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ నోట్ల చెల్లుబాటు విషయంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనలలో కొన్నింటిని మార్చి, మరికొన్నింటిని చేర్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…

కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, మునిసిపల్, స్థానిక సంస్థల యాజమాన్యాలలో నడుస్తున్న అన్ని పాఠశాలలలో స్కూలు ఫీజులను రూ. 2వేల వరకు రూ. 500 నోట్లతో చెల్లించవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలలో కూడా ఫీజులు చెల్లించవచ్చు.
రూ. 500 వరకు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జికి చెల్లించుకోవచ్చు.
ఒకసారి రూ. 5వేల విలువైన వస్తువులను వినియోగదారుల సహకార స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.
మంచినీళ్లు, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. ఇది కేవలం వ్యక్తుల గృహాలకు మాత్రమే వర్తిస్తుంది.
రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశా్ఖ కోరిక మేరకు టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ మినహాయింపు, 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 500 నోట్లతో చెల్లింపునకు ఆమోదం
విదేశీయులు వారానికి రూ. 5000 వరకు విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతి. దీనికి సంబంధించిన ఎంట్రీలను వాళ్ల పాస్‌పోర్టులలో నమోదుచేస్తారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply