ఇంట్లో ఔషదాలతో మొటిమలు నివారించవచ్చు..!

Other

Loading...

మనిషి యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత యువతీ యువకుల్లో ఎక్కవగా బాధించే విషయం మొటిమలు. ఇవి మన శరీర తత్వాన్ని బట్టి..వాతావరణ పరిస్థితులను బట్టి మనం తినే ఆహారాన్ని బట్టి వస్తుంటాయి. ఏది ఏమైనా ఈ మొటిమల కారణంగా కాలేజీలో చదివే అమ్మాయిలు..అబ్బాయిలు చాలా ఇబ్బంది పడుతుంటారు.

మొటిమలు తగ్గించుకోవడానికి ఈ పద్దతులు పాటించండి..!!

పల్లి నూనె : ఒక చెంచా పల్లి నూనెను నిమ్మకాయ రసానికి కలిపి, ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి పూయండి. ఈ మిశ్రమం మీ చర్మంలో ఏర్పడే మొటిమలను మరియు నల్లటి వలయాలను నివారించటమే కాకుండా వాటి ఏర్పాటును ఆలస్యం చేస్తుంది.

chudu

తేనే : మీ చర్మానికి తేనేను పూసి, కాస్త ఎండే వరకు కొంత సమయం వేచి ఉండండి. తేనే మొటిమల నివారణకు మరియు చర్మాన్ని సున్నితంగా మారటానికి శక్తివంతంగా పని చేస్తుంది.

పొప్పడి పండు : పచ్చి పొప్పడి పండు రసం మొటిమల నివారణకు చాలా శక్తివంతంగా పని చేసే ఔషదంగా చెప్పవచ్చు. పచ్చి పొప్పడి పండు రసాన్ని చర్మానికి రాసి, ఎండే వరకు అలానే ఉండనివ్వండి. ఇలా చేయటం వలన చర్మం పైన ఒక పొరలాగా ఏర్పడుతుంది, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. పొప్పడి రసం వాడటం వలన వేగంగా ఫలితాలను పొందుతారు. మొటిమలను తగ్గించటంలో శక్తి వంతంగా పని చేయటమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

బంగాళదుంప : ఒక పచ్చి బంగాళదుంపను తీసుకోండి, దానిపై ఉండే బాహ్య చర్మాన్ని తోలగించండి. ఒక పలుచని గుడ్డను తీసుకొని, అందులో ఉంచి గట్టిగా కట్టడం వలన ఒక ప్యాడ్’ల ఏర్పడుతుంది. ఈ ప్యాడ్’ను మొటిమల ప్రభావిత ప్రాంతంలో 10 నిమిషాల పాటు, వలయాల రూపంలో రాయండి. తరువాత గోరుఎచ్చని నీటితో కడిగి వేయండి. ఇలా చేయటం వలన చర్మం పైన ఉండే నల్లటి వలయాలు మరియు వివిధ రకాల మొటిమలు తోలగిపోతాయి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply