మేముసైతం కార్యక్రమంలో పవన్ గొప్పతనాన్ని బయట పెట్టిన మహిళ

Movies

Loading...

పవన్ కళ్యాణ్  తాను చేసే పనులకు అందరిలా పెద్దపెద్ద పబ్లిసిటీలు ఆశించడు అన్న విషయం తెలిసిoదే. అయితే  మంచులక్ష్మి నిర్వహిస్తున్న ‘మేముసైతం’ కార్యక్రమం ద్వారా  పవన్ కొద్ది కాలం క్రితం ఒక మహిళకు  చేసిన అజ్ఞాత సహాయం మరోసారి బయట పడింది.  రూపాయి దానమిచ్చి లక్షలు ఇచ్చినట్లుగా  ప్రచారం చేసుకుంటున్న ఈరోజులలో ‘మేముసైతం’ కార్యక్రమంలో  ఒక మహిళ అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చేసిన సాయం గురించి చెపుతూ ఉంటే ఆ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ మైండ్ బ్లాంక్ అయింది.

ఆశక్తికరమైన ఈ సంఘటన వివరాలోకి వెళ్ళితే ఖమ్మంలో వృత్తి రీత్యా టీచర్ గా పని చేస్తున్న ఒక మహిళ వృద్ధాశ్రమం నడుపుతూ ఉండేది.  ఆమె రిటైర్ అయ్యాక ఆ వృద్ధాశ్రమాన్ని నడపగాలనా అన్న  భయం ఆమెకు ఏర్పడిందట. దానితో పవన్ కళ్యాణ్ సాయం చేస్తాడని ఎవరో చెప్పడంతో పవన్ తో ఆమెకు ఎటువంటి పరిచియం లేక పోయినా పవన్  ఇంటికి వెళ్లిందట.

chudu

గేట్ దగ్గర నిలబడి చాలసేపు అటూ ఇటూ తిరుగుతుంటే ఎవరో వచ్చారని తెలియడంతో కిందకు వచ్చిన పవన్ ఆమెను చూసి విషయం తెలుసుకుని  తన కార్లో కూర్చోబెట్టుకుని తన ఆఫీస్ కు తీసుకెళ్లాడట.  ఆతరువాత ఆమె నడుపుతున్న వృద్ధాశ్రమంలోన్ ఎంతమంది ఉన్నారు లాంటి ప్రశ్నలు అడిగి తర్వాత కాఫీ కలిపి ఇచ్చి ఫిష్ తెప్పించి వడ్డించి తినమన్నాడట.

ఇదంతా చూసి ఆమె భయపడుతుంటే ‘అమ్మా ఎందుకు భయపడుతున్నారు. నేను మీ కొడుకుని..మీరు నా అమ్మ’ అంటూ పవన్ చెప్పడంతో ఆశ్చర్యపోయిందట ఆమహిళ. చివరకు ఆమె వెళ్లేటపుడు లక్ష రూపాయలు ఆమె అకౌంట్లో వేయమని చెప్పి మరో పదివేల రూపాయల ఖర్చులకోసం ఇచ్చాడట పవన్. 3-4 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను ఆ మహిళ ‘మేముసైతం’ కార్యక్రమంలో కళ్ళకు కట్టేడట్లుగా వివరిస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి మంచుతో పాటు ఆ కార్యక్రమాన్ని చూస్తున్న వారంతా షాక్ అయ్యారు. పవన్ లో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టే అతడి గురించి ఎన్ని నెగిటివ్ వార్తలు ప్రచారంలో ఉన్నా ఎవరూ పట్టించుకోరు..

Loading...
Loading...

Share This Article

Leave a Reply