మీకు సొంతిల్లు లేదా అయితే మోడీ సర్కార్ మీకు పండగ లాంటి వార్త తీసుకొస్తోంది.

News

Loading...

సొంతిల్లు.. ఎందరికో ఓ కల. ఆ కల సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్ద నోట్ల రద్దుతో ఆ కల కలగా మిగలనుందా అన్న భయం నెలకొంది. ఇప్పుడా ఆ భయాన్ని దూరం చేసే పనిలో  పడింది కేంద్రం. పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటి ప్రయోజనం సొంతిల్లు కట్టుకోవడమేనని చెబుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా చేస్తోంది. దీనిలో భాగంగా ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది.

రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా అందరికీ అందుబాటలో గృహ నిర్మాణ రంగానికి మేలు చేసేలా పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకంపై ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు ముఖ్య అధికారులతో చర్చించినట్టు తెలిసింది. ఈసారి 2017 కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1 నాడే ప్రవేశపెట్టే అవకాశాలుండడంతో అంతకంటే ముందుగానే అంటే జనవరి 1 నుండి ఫిబ్రవరి 1 మధ్యనే కొత్త హౌసింగ్ పథకాన్ని ప్రకటించనున్నట్టు కనిపిస్తోంది.

chudu

రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో గత కొద్ది రోజులుగా కొనుగోళ్లు పడిపోయి గృహ నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. కాగా బ్యాంకులు కూడా ప్రజలను గృహ రుణాల వైపు ఆకర్షించేందుకు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిసారి రుణం తీసుకునే వారికి అందుబాటులోనే వడ్డీరేట్లు ఉండటంతో.. ఈ పథకం హౌసింగ్ మార్కెట్‌కు మరింత ఊతమివ్వగలదని, రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ కోలుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

నోట్లరద్దుతో వసూలవుతున్న ఆదాయంపై..

పూర్తి స్పష్టత వచ్చిన తరువాతే గృహ పథకంపై మోదీ తుదినిర్ణయానికి రానున్నట్టు సమాచారం. ఈ పథకంలో భాగంగా రూ.50 లక్షల వరకు ఇచ్చే గృహ రుణాలపై 6-7 శాతం వడ్డీ ఉండేలా ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం వస్తోంది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply