మీరు పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నారా… అయితే ఇలా చేసి 20 వేలు పొందండి

Other

Loading...

ప్రస్తుతమున్న టెక్నాలజీ రంగంలో ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్స్ చేస్తూనే ఉంటారు. అలాoటి వారందరికి ఇంకా కొత్త కొత్త ఆఫర్స్ మన వాళ్ళు పెడుతూ వాళ్ల వినియోగదారులను పెంచుకుంటున్నారు . ఇప్పుడు చాలా మంది డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతు వారి కంపెనీ యూజర్ల ని పెంచుకుంటూ ఫోతున్నారు. అలాగే ‘ఫ్రీచార్జ్’ కంపెనీ తాజాగా తన యూజర్ల కోసం కొత్త ఈ-వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్ ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు / వ్యాపారులు వారి మొబైల్ ఫోన్ ను పోగొట్టుకుంటే వాలెట్ బ్యాలెన్స్పై రూ .20,000 వరకూ ఉచిత భీమాను పొందొచ్చు. అనే సదుపాయాన్ని ప్రవేశపెట్టిoది.
దీన్నిఅమలు చేయటానికి ఫ్రీచార్జ్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘ఈ-వాలెట్ల వినియోగం, భద్రతకు సంబంధించి వినియోగదారుల్లో ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మొబైల్ ఫోన్ జారిపోయినప్పుడు కస్టమర్ల డబ్బుకు రక్షణ కల్పిస్తుంది ‘అని కంపెనీ తెలిపింది.

ఫోన్ పోయినప్పుడు కన్సూమర్ 24 గంటల లోపు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలని ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఫ్రీచార్జ్కు ఈ-మెయిల్ లేదా కస్టమర్ కేర్కు కాల్ చేసి తెలియజేయాలని చెప్పారు. నెలలో కనీసం ఒకసారైన లావాదేవీ నిర్వహిస్తేనే బీమా వర్తిస్తుందని తెలిపారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply