బీరకాయ – ఆరోగ్య ప్రయోజనాలు

Telugu World

Loading...

బీరకాయ – ఆరోగ్య ప్రయోజనాలు……..
1) బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.
2) సెల్యులోజ్, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం.
3) రక్తంలో , మూత్రంలో చక్కెర స్తాయిలను అదుపులో ఉంచుతుంది.కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది మంచిది.
4) బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
5) బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, యాక్నె సమస్యలు తొలగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్ కారక వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6) కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply