డిగ్రీ చేసిన వెంటనే జాబ్ కావాలా ? ఇవిగో కోర్సులు !

Jobs

Loading...

కొంతమంది యువత డిగ్రీ చేసిన వెంటనే మాస్టర్స్‌ చేయాలనుకోరు. కాలేజీ నుంచి బయటకు రాగానే తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఇలాంటి వారికి కేవలం గ్రాడ్యుయేషన్‌ చేస్తే జాబ్‌ రాదు. వీళ్లు ఏదైనా షార్ట్‌టర్మ్‌ కోర్సులపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే కాలేజిలో డిగ్రీ చేసి బయటకు రాగానే ఉద్యోగం సంపాదించుకోవడానికి షార్ట్‌ టర్మ్‌ కోర్సులు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా లేదా సర్టిఫికేట్‌ కోర్సులు చేస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ కోర్సుల వివరాలు…

డిజిటల్‌ మార్కెటింగ్‌

chudu

అర్హత: ప్లస్‌ టు/అండర్‌గ్రాడ్యుయేషన్‌
కాలపరిమితి: 4-8 నెలలు
ఉద్యోగ అవకాశాలు: ఎస్‌ఇవొ ఎగ్జిక్యూటివ్‌, సోషల్‌ మీడియా ఎక్స్‌పర్ట్‌, ఇంటర్‌నెట్‌ మార్కెటింగ్‌, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, సోషల్‌మీడియా మార్కెటింగ్‌, సర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌
ఇన్‌స్టిట్యూట్స్‌: ది ఇన్‌ష్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అకౌంట్స్‌ (ఐసిఎ), కోల్‌కత వెబ్‌ అకాడమీ, ఎన్‌ఐఐటి, ఇండస్‌ నెట్‌ అకాడమీ
ప్రారంభ జీతం: నెలకు రూ.20,000 నుంచి రూ.35,000

నెట్‌వర్క్‌ ఇంజనీర్‌
అర్హత: ప్లస్‌ టు, హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ గురించి ప్రాథమిక జ్ఞానం అవసరం
కాలపరిమితి: 2-15 నెలలు
ఉద్యోగ అవకాశాలు: డేటాబేస్‌ అడ్మినిసే్ట్రటర్‌, నెట్‌వర్కింగ్‌ అడ్మినిసే్ట్రటర్‌, ఎల్‌ఎన్‌ (లాన్‌) ఇంజనీర్‌, సెక్యూరిటీ అడ్మినిసే్ట్రటర్‌, వెబ్‌ సర్వర్‌ అడ్మినిసే్ట్రటర్‌
ఇన్‌స్టిట్యూట్స్‌: ఓరియన్‌ ఎడ్యుటెక్‌, యాప్‌టెక్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎథికల్‌ హాకింగ్‌
ప్రారంభ జీతం: నెలకు రూ.15,000 నుంచి రూ.35,000

డేటా మైనింగ్‌
అర్హత: ప్లస్‌ టు
కాలపరిమితి: 2-10 నెలలు
ఉద్యోగ అవకాశాలు: బిజినెస్‌ ఎనలిస్టు, డేటా సైంటిస్టు, డేటా ఎనలిస్టు
ఇన్‌స్టిట్యూట్స్‌: జిగ్‌సా అకాడమీ, అప్‌గ్రేడ్‌, ఎడ్యురేక, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.
ప్రారంభ జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.80,000

అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌
సర్టిఫైడ్‌ ఇండస్ట్రియల్ అకౌంటెంట్‌ కోర్సులో శాప్‌ మాడ్యూల్స్‌, టాలీ వంటి సాఫ్ట్‌వేర్‌ అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌ ఎక్సెల్‌ వంటివి ఉంటాయి.
అర్హత: ప్లస్‌ టు
కాలపరిమితి: 8-18 నెలలు
ఉద్యోగ అవకాశాలు: ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కమర్షియల్‌ మేనేజర్‌
ఇన్‌స్టిట్యూట్స్‌: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అకౌంట్స్‌, ఎన్‌ఐఐటి, యాప్‌టెక్‌
ప్రారంభజీతం: నెలకు రూ.8,000 నుంచి రూ.30,000

వెబ్‌ డిజైనింగ్‌
అర్హత: ప్లస్‌ టు
కాలపరిమితి: 4-24 నెలలు
ఉద్యోగ అవకాశాలు: గ్రాఫిక్‌- వెబ్‌ డిజైనర్‌, వెబ్‌-యానిమేషన్‌, వెబ్‌ డెవలెపర్‌, పిహెచ్‌పి, సిఎస్‌ఎస్ డెవలెపర్‌, మల్టీమీడియా డిజైనర్‌.
ఇన్‌స్టిట్యూట్స్‌: డిక్యూ స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌, ఎరెనా యానిమేషన్‌, మాయా అకాడమీ ఆఫ్‌ ఆడ్వాన్స్‌డు సినిమాటిక్స్‌ (ఎంఎఎసి), మాగ్‌డిసాఫ్ట్‌.
ప్రారంభజీతం: నెలకు రూ.10,000 నుంచి రూ. 15,000

సైబర్‌ సెక్యూరిటీ
అర్హత: ప్లస్‌ టు, సాఫ్ట్‌వేర్‌, డేటాబేస్‌, నెట్‌వర్కింగ్‌లలో ప్రాథమిక అవగాహన అవసరం.
కాలపరిమితి: 2-15 నెలలు
ఉద్యోగ అవకాశాలు: పెనిట్రేషన్‌ టెస్టర్‌, సెక్యూరిటీ ఎనలిస్ట్‌, ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, క్రిప్టోగ్రాఫర్‌, సెక్యూరిటీ స్పెషలిస్ట్‌, వల్‌నరబిలిటీ ఎసెసర్‌…
ఇన్‌స్టిట్యూట్స్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌, మైక్రోప్రో, మెర్క్యురీ కోనిగ్‌ సొల్యూషన్స్‌, మెర్క్యురీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌.
ప్రారంభ జీతం: నెలకు రూ.25,000 నుంచి రూ.35,000

Loading...
Loading...

Share This Article

Leave a Reply