మీ గత జన్మ రహస్యం.. ఒక్క సెకనులో తెలుసుకోండిలా..!

Other

Loading...

జన్మ అనేది ఉంటుందో లేదో తెలియకపోయినా దాని గురించి తెలుసుకోవాలనే కొరిక చాలా మందికి ఉంటుంది. దీనికి సినిమాలూ ఓ కారణంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాల్లో హీరో హీరోయిన్లు ఒక జన్మలో కలవకపోయినా మరో జన్మలో కలుస్తుంటారు. అది రీల్ లైఫ్ అని తెలిసినా రియల్ లైఫ్ అనుకుంటారు చాలా మంది. అందుకే సినిమాలోలా చాలా మందికి గత జన్మలో మనమేంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఫేస్‌బుక్ ఒక కొత్త ఆప్షన్‌ను తీసుకువచ్చింది. మరి మీకు కూడా గత జన్మలో ఎలా పుట్టారో తెలుసుకోవాలని ఉందా? అయితే అదేంటో మీరూ ట్రై చేయండి.
మీకు ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయ్యి ఉంటే మీ గత జన్మ వివరాలను తెలుసుకోవడం నిజంగా చిటికెలో పనే! ఇందుకు కావాల్సిందల్లా మీకు ఓ ఫేస్ బుక్ అకౌంట్ ఉండటమే. ఈ రోజుల్లో ఫేస్ బుక్ అకౌంట్ లేనివారు ఎవరున్నారు చెప్పండి.
మీ గత జన్మ రహస్యం.. ఒక్క సెకనులో తెలుసుకోండిలా..!?
మీరు Bhowww.com అనే వెబ్ సైట్ లోకి వెళితే అక్కడ ఇంగ్లీష్ యాప్ అనే ఓ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే.. Find Out Your Past Life Secrets ! అనే ఓ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేయమని చెబుతుంది. మీరు ఓకే అని ప్రెస్ చేస్తే చాలు.. కొన్ని క్షణాల్లో మీ గత జన్మ రహస్యం మీ ముందు ఉంటుంది. మీరు గత జన్మలో ఎప్పుడు పుట్టారు. ఆ జన్మలో ఏం చేసేవారు.. మీరు ఎలా చనిపోయారు. గత జన్మలో మీరు మీ లక్షణాలు ఏంటి అనే నాలుగైదు అంశాలు అందులో కనిపిస్తాయి. అయితే ఇవన్నీ మీ ఫేస్ బుక్ లో ఉన్న ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే తయారు చేశామంటోందీ వెబ్ సైట్. మరి ఈ గత జన్మ వివరాలు ఎంతవరకూ కరెక్టని మాత్రం అడక్కండి. దీన్ని సీరియస్ గా తీసుకోకండి.. కాకపోతే.. జస్ట్ తమాషా చూద్దాం అనుకుంటే బాగానే ఉంటుంది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply