జియో యూజర్లకు షాక్ లాంటి వార్త – మీరు జియో సిమ్ ఉపయోగిస్తే తప్పక చదవండి

News

Loading...

రిలయన్స్ జియో యూజర్లను కలవరపాటుకు గురి చేసే విషయమిది. సెప్టెంబర్ 4వరకూ రిలయన్స్ జియో సేవలు ఉచితమని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఆ తర్వాత ఈ నెల మొదట్లో మార్చి 31వరకూ ఉచిత సేవలు కొనసాగుతాయని కూడా ప్రకటించారు. న్యూ ఇయర్ ఆఫర్‌గా ఈ సేవలను అందిచనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఫ్రీ ఆఫర్‌ను పొడిగించడంపై ఎయిర్‌టెల్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
ట్రాయ్ ఈ పొడిగింపుకు అనుమతించడంపై ఎయిర్‌టెల్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలెట్ ట్రిబ్యూనల్‌(టీడీశాట్)కు ఫిర్యాదు చేసింది. జియో విషయంలో ట్రాయ్ మెతక వైఖరి అవలంభిస్తోందని, ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఎయిర్‌టెల్ ఈ ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారించిన టీడీశాట్ జియో కౌన్సెల్‌‌ను హాజరుకావాలని ఆదేశించింది. ట్రాయ్ జియోకిచ్చిన అనుమతిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, జియోను ప్రతివాదిగా చేర్చాలని ట్రాయ్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను జనవరి 6, 2017కు టీడీశాట్ వాయిదా వేసింది.
జియో ప్రమోషనల్ ఆఫర్ డిసెంబర్ 3తో ముగుస్తుందని అక్టోబర్ 20న ట్రాయ్ నిర్ణయం తీసుకుందని, కానీ ట్రాయ్ జియో సూచనతో ఈ ఆఫర్‌ను మార్చి వరకూ పొడిగించిందని ఎయిర్‌టెల్ తన వాదనను వినిపించింది. ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్ వల్ల జియో న్యూ ఇయర్ ఆఫర్ నిలిచిపోయే అవకాశముంది. డిసెంబర్ 31తర్వాత జియో సేవలకు ఛార్జీలు చెల్లించకతప్పని పరిస్థితి ఉంటుందని టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు.
రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్‌పై ఎయిర్‌టెల్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. టెలికామ్ రెగ్యులేటర్ అధారిటీ(ట్రాయ్)కి జియోపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఏకంగా ట్రాయ్‌పైనే టీడీశాట్‌కు ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్ తీసుకున్న నిర్ణయం జియో యూజర్లపై ప్రభావం చూపనుంది. రిలయన్స్ జియో వల్ల అప్పటి వరకూ టెలికామ్ రంగంలో అగ్ర స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఫ్రీ ఆఫర్‌ను పొడిగించడంతో ఎయిర్‌టెల్ మరింత ప్రమాదంలో పడింది. దీంతో ఎలాగైనా ఈ ఫ్రీ ఆఫర్ పొడిగింపును అడ్డుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply