ఒక్కప్పుడు మెకానిక్… నేడు ప్రపంచంలోనే ఎత్తైన టవర్స్‌లో 22 అపార్ట్‌మెంట్ల యజమాని అయ్యానే

Get Inspired

Loading...

వింతా కాదు…విశేషం అంతకంటే కాదు. పట్టుదల..అందుకు తగిన కృషి ఉంటే కలలు పండించుకోవడం పెద్ద పనేం కాదని మెకానిక్ స్థాయి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన భారతీయుడు జార్జి వి.నేరీపరంబిల్ నిరూపించారు. ప్రస్తుతం ఆయన దుబాయిలోని బుర్జ్ ఖలీఫాలో 22 అపార్ట్‌మెంట్లకు ఓనర్. ప్రపంచంలోనే ఎత్తైన టవర్స్‌గా పేరున్న బుర్జ్ ఖలీఫాలో మొత్తం 900 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో 22 ప్లాట్లను సొంతం చేసుకున్న నేరీపరంబిల్ ఇంతటితో తాను సరిపెట్టుకోదలచు కోలేదని, మంచి డీల్ కుదిరితే మరిన్ని ఫ్లాట్లను కొనుగోలు చేస్తానని చెబుతున్నారు. ‘మంచి బేరం (డీల్) కుదిరితే మరిన్ని ఫ్లాట్లు కొంటా. నేను కలలు కంటాను. ఆ కలలను సాఫల్యం చేసుకోవడంలో ఏమాత్రం వెనుదీయను’ అని తెలిపారాయన. కేరళకు చెందిన నేరీపరంబిల్ పట్టుదల వెనుక ఓ కారణం కూడా ఉందట.

ఒకసారి బుర్జ్ ఖలీఫా టవర్స్‌ను తన బంధువు ఒకరు చూపుతూ ఇందులో ఒక్కసారైనా నీవు ప్రవేశించగలవా అని తనను ప్రశ్నించారని, అదే తనలో పట్టుదలను పెంచిందని ఆయన చెప్పారు. 2010లో ఆ భవంతిలో ఒక అపార్ట్‌మెంట్ అద్దెకున్నట్టు ఒక వార్తాపత్రికలో ప్రకటన చూసి అదేరోజు అందులోకి అద్దెకు దిగానని, ఆ తర్వాత నుంచి అక్కడే ఉంటున్నానని ఆయన తెలిపారు. ఆరేళ్లలో 22 ఫ్లాట్లు కొనుగోలు చేశానని, వాటిలో ఐదింటిని అద్దెకు ఇచ్చానని, మంచి వ్యక్తులు దొరికితే మిగతా వాటిని కూడా అద్దెకిస్తానని చెప్పారు. దుబాయ్‌లో తన ఎదుగుదలను వివరిస్తూ, దుబాయ్‌లోని వేడి వాతావరణం చూసి ఎయిర్ కండిషన్ బిజినెస్ మొదలుపెట్టి క్రమంగా జీఇఓ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్థాపించినట్టు వివరించారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply