ఈ యాప్ లో చాటింగ్ చేసే కొద్ది డబ్బులు, గిఫ్ట్‌కార్డులు

Gadgets

Loading...

ఇది ఒక ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ‘ప్రస్తుతం మార్కెట్‌లో ఇలాంటి యాప్స్ చాలానే ఉన్నాయి కదా! మరి దీన్నే ఎందుకు వాడాలి?’ అనే ప్రశ్న మీకు రావచ్చు. అయితే ఈ యాప్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాటింగ్ చేసే కొద్ది డబ్బులు, గిఫ్ట్‌కార్డులు గెలుచుకోవచ్చునని యాప్‌ను రూపొందించిన సంస్థ చెబుతోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూకే, అమెరికా, భారత్‌లలో మాత్రమే టెంగీ యాప్ అందుబాటులో ఉంది. మరే ఇతర దేశంలోని వారితోనైనా చాట్ చేయాలంటే అక్కడి వారు ‘టెంగీ లైట్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. టెంగీ లైట్ యాప్‌లో గిఫ్ట్ కార్డులను గెలుచుకునే సౌలభ్యం లేదు.

 ప్రత్యేకతలు
► ఉచితంగా చాటింగ్  చేసుకోవచ్చు. టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు, ఆడియో ఇలా ప్రతి దాన్నీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు.
► స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా గ్రూప్ చాట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.
► యాప్ ద్వారా బహుమతులను గెలుచుకోవాలంటే మొదట ఎక్కువ టికెట్స్‌ను సొంతం చేసుకోవాలి. టికెట్స్ పొందాలంటే మీరు మీ  స్నేహితులకు ఈ యాప్‌ను సిఫార్సు చేయాలి. వాళ్లు టెంగీని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు కొన్ని టికెట్స్ వస్తాయి. వారితో చాటింగ్ చేస్తే మరికొన్ని టికెట్స్ వస్తాయి. ఈ విధంగా మీ స్నేహితులు ఎంత ఎక్కువ మంది టెంగీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు అన్ని టికెట్స్ వస్తాయి.
► టెంగీ ప్రతి వారం లాటరీలు తీస్తుంది. అందులో గెలుపొందిన వారు డబ్బుల్ని, అమెజాన్ గిఫ్ట్ కార్డుల్ని సొంతం చేసుకోవచ్చు.
► యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఏ అడ్వర్టైజ్‌మెంట్ వారికి ఇవ్వబోమని, భద్రంగా ఉంచుతామని సంస్థ చెబుతోంది. అలాగే వినియోగదారుల నుంచి ఎలాంటి డబ్బుల్ని వసూలు చేయటం లేదని కూడా సంస్థ పేర్కొంది.
► అడ్వర్టయిజింగ్ ద్వారా తమకు వచ్చే ఆదాయంలో దాదాపు సగ భాగాన్ని తిరిగి యూజర్లకే అందిస్తున్నామని సంస్థ చెబుతోంది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply