2016లో టాప్ ఎంఎన్ సి కంపెనీలు ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నల్లో అత్యంత క్లిష్టమైన ప్రశ్నలివే…

Jobs

Loading...

2016లో టాప్ ఎంఎన్ సి కంపెనీలు ఇంటర్వ్యూల్లో అడిగిన ప్రశ్నల్లో అత్యంత క్లిష్టమైన ప్రశ్నలివే…
1. గూగుల్
మీకు ఒక పెన్సిల్ బాక్స్ ఇచ్చామనుకోండి… సంప్రదాయంగా వాటిని వాడే విధంగా కాకుండా, మరో పది విధాలుగా ఎలా, ఏవిధంగా వాడగలరో చెప్పండి!
2. అమెజాన్
మీరు Mars గ్రహం నుంచి వచ్చి ఉంటే, సమస్యలను ఎలా అధిగమిస్తారు?
3. యాపిల్
కాలాన్ని జయించాలంటే అత్యంత సృజనాత్మక విధానం ఏది?
4. పసిఫిక్ సన్ వేర్
మీరొక street sign అనుకోండి… అప్పుడు మీరెలా ఉండేవారు?!
5. మైక్రోసాఫ్ట్
ఒక స్పిండిల్ మీద ఒక డిస్క్ తిరుగుతోంది… ఎటు తిరుతుతోందో మీకు తెలియదు… మీకు రెండు పిన్నులు ఇచ్చారు… వాటిని ఉపయోగించి అది ఎటు తిరుగుతోందో ఎలా తెలుసుకుంటారు?!
6. గోల్డ్‌మన్ సాచ్స్
ఒక పలక మీద అనేక నలుపు, తెలుపు చుక్కలు ఉన్నాయి… ఒక నలుపు చుక్క, తెలుపు చుక్కల మధ్య దూరం ఒక యూనిట్‌గా ఎలా నిరూపిస్తారు?
7. ఫేస్‌బుక్
ఒక సంచిలో అనేకానేక దారాలు ఉన్నాయి… random గా ఒక దారం కొసను మీకు ఇస్తారు… మరో దారపు కొసను మీరు బయటికి తీసి రెండింటిని ముడివేయాలి… సంచిలో loose ends దారాలు అయిపోయేవరకూ మీరీవిధంగా చేయాలి… అప్పుడు మొత్తం ఎన్ని expected loops ఉంటాయి?!
8. జెపి మోర్గాన్ చేజ్
ఇంతకు ముందు ఎవరూ ఊహించని ఒక ప్రొడక్ట్ లేదా ఒక సర్వీస్‌ను ఆలోచించండి… మీ యూనివర్సిటీలో అది విప్లవాత్మకంగా ఉండాలి… మీరు దాన్నెలా మార్కెటింగ్ చేస్తారు?
9. గూగుల్
మీరు చెవిటి వారి కోసం ఒక ఫోన్ తయారు చేయాలనుకుంటున్నారు! ఏవిధంగా చేస్తారు?
10. ట్విట్టర్
మేము మిమ్మల్నెందుకు ఉద్యోగంలోకి తీసుకోకూడదో చెప్పండి!
11. మైక్రోసాఫ్ట్
ఒక ఎలివేటర్‌ని మీరెలా డిజైన్ చేస్తారు?
12. మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్‌లు ఏమేంటో చెప్పండి?
13. ట్విట్టర్
ఈ బైనరీ ట్రీ తనకు తానే అద్దమా?!
14. ఎఐజి
ఒక సర్క్యులర్ కేక్‌ను ఎనిమిది సమాన భాగాలుగా ఏవిధంగా కోస్తారు?
15. గోల్డ్‌మన్ సాచ్స్
బోయింగ్ 707 బరువు ఎంత?!
16. పెప్సికొ
Higher Power లో మీకు నమ్మకం ఉందా?
17. ఎంటిడి ప్రొడక్ట్స్
సంవత్సరం పొడవునా క్లిష్టమైన వాతావరణంలో పని చేయాలంటే మీరెలా ఫీల్ అవుతారు?!

Loading...
Loading...

Share This Article

Leave a Reply