మీకు జాబ్ కావాలా…అయితే ఇలా చేయండి.

Jobs

Loading...

ఎక్స్ ఫీరియన్స్డ్ కన్న ఒక ఫ్రెషర్ గా జాబు సంపాదిచటం చాల కష్టం. అక్కడ కుర్చున్నప్పడి నుంచి లేచేంత వరకు టెన్షన్ అలాంటి వాటినుంచి తప్పించుకోవటం ఏలా…కొన్ని టిఫ్ మీకోసం

1. మీరు మొదట చేయాల్సిన పని…అన్నయ్య చెప్పాడనో…సీనియర్ చెప్పాడనో కాకుండా మీకు ఏది ఇష్టం మీరు ఎందులో టాప్…ఎదైతే ప్రస్తుత పరిస్ధితుల్లో మార్కెట్ లో ఎక్కువ జాబ్స్ ఇస్తున్నారు ఆలోచించి కోర్స్ చేయండి.
2. మీరు నేర్చుకుంటున్నారో…దానిపై పూర్తి నమ్మకంతో ఉండండి…మార్కెట్ లో పరిస్ధితు బాగలేకున్నా… వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటూ…దానిలో  PHD చేసేంతగా ప్రావీణ్యం సాధించండి.

chudu

3.ఒక వేళ మనకు నచ్చని జాబ్ వచ్చినా..కొన్ని రోజులు చేస్తు మళ్లీ రెండవదానిపై ట్రై చేస్తూ అది వచ్చే వరకు ట్రై చేయటం మంచిది. లేట్ అయినా ఒక సబ్జెక్టు పైన పట్టుతో ఏదో ఒక రోజు జాబు కొట్టచ్చు.

4. పొద్దున్నే లేదా సాయంత్రం ఒక గంట క్లాసు వినండి..విన్న తరువాత మొక్కుబడిగా ల్యాబ్ చేయకుండా… నేర్చుకోండి
5. మీ కోర్స్ మీ పక్క రూమ్ లో …పక్క వీధిలో ఉంటారు . వారితో స్నేహాన్ని డెవలప్ చేసుకోండి. ఒక వేళ తనకు ఏదైన అవకాశం వస్తే..మీకు చెబుతాడు.దీంతో మనకి మంచి నెట్ వర్క్ ఏర్పడుతుంది.అ ఫీల్డ్ లో వర్క్ చేసే సీనియర్లు ..కంపెనీ  ఎంప్లాయ్  లు పరిచయమవటం వల్ల అక్కడే మనకి మంచి ఇంటర్వ్యూ  రిఫరెన్స్ దొరకచ్చు.

6. అన్ని సోషల్ నెట్ వర్క్ లలో లింకేడిన్  సోషల్ నెట్ వర్క్ దారి వేరు. ఈ రోజు చాలా కంపెనీలు లింకేడిన్ లో జాబు పోస్టింగ్ వేస్తున్నాయి. అక్కడనుండే తమకు కావాల్సిన ఎంప్లాయ్ ని పట్టుకున్తున్నాయి.

7. మంచి లింకేడిన్  ప్రొఫైల్ పెట్టుకోండి. మన ఎడ్యుకేషన్ వివరాలు. మనం కాలేజీ లో సాధించిన విజయాలు. ఏదయినా ఈవెంట్లో పాల్గొన్న విషయాలు, అవార్డులు లాంటి వాటి గురుంచి లింకేడిన్  ప్రొఫైల్ లో పెడితే బాగుంటుంది.ఈ రోజుల్లో Resume అంటే లింకేడిన్ ప్రొఫైల్ .

8.ఈ రోజుల్లో  షోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు.. అయితే,దానిని మనం సరిగ్గా వాడుకుంటే అటు ఎడ్యుకేషన్ కి ,జాబ్ అవకాశాలకి బాగా పనికి వస్తుంది.మనం జాబ్ ట్రై చేసే ఫీల్డ్ లో అప్పటికే పని చేస్తున్న సీనియర్ ల ప్రొఫైల్ ఫాలో అవ్వచ్చు.వారితో ఒక నెట్ వర్క్ ఏర్పరుచుకోవచ్చు.
ఫేస్ బుక్ టెక్నాలజీ గ్రూప్ లులో జాయిన్ అవ్వచ్చు. మీరు చేరాలి అనుకునే కంపెనీ బిజినెస్ పేజిలు ఫాలో అవ్వచ్చు.
9.చాలా కంపెనీలు తమ ఓపెనింగ్ గురుంచి జాబ్ పోర్టల్ లో వెస్తారు వాటిని సరిగ్గా ఫాలో అవ్వండి.

10. మనలో చాలా మందికి జాబ్ రాకపోవటానికి ప్రధాన కారణం భయం.ఇంగ్లీష్ రాదూ అనో…జాబ్ కి వెళ్ళే సబ్జెక్టు రాదూ అనో…అసలు మనకి జాబ్ రాదూ అని ముందే మెంటల్ గా ఫిక్స్ అవటం వలనో..నలుగురితో మాట్లాడటం రాకో మనలో తెలియని భయం ఆవహించుకుపోయింది.ముందు ఆ భయాన్ని తరిమి కొట్టండి.

11. ఏ కంపెనీ అయినా నీలో సబ్జెక్టు కన్న…నీలో ఉన్న ఆత్మవిశ్వాసం చూస్తుంది.ఆత్మవిశ్వాసం పెరగాలి మెల్లగా మనకి మనమే ఒక ధైర్యం, మన మీద మనకి నమ్మకం కూడగట్టుకోవాలి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply