ఫోన్ చేస్తే రూ.10 వేల డిపాజిట్‌… ఇంకెందుకు లేట్ ట్రై చేస్తే పోలా

Telugu World

Loading...

పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని గ్రామీణ ప్రాంతాల్లో రోజోకో పుకారు వ్యాపిస్తోంది. తాజాగా ఓ సెల్‌ఫోన్ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు ఆ వ్యక్తి ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్‌ అవుతుందని వదంతి చెలరేగింది. తిరుచ్చి జిల్లా ముసిరి, తండయార్‌పేట, తొట్టియం గ్రామాల్లో ఈ వదంతి దావానలంలా వ్యాపించటంతో ప్రజలు సదరు మొబైల్‌కు అదేపనిగా ఫోన్లు చేస్తున్నారు. అయితే ఆ సెల్‌ఫోన్ నెంబర్‌కు ఎవరు ఫోన్ చేసినా బిజీ బిజీ అనే సందేశమే వస్తోంది. ఈ విషయమై బ్యాంక్‌ అధికారులు మాట్లాడుతూ… ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంక్‌ అకౌంట్‌నెంబర్‌, సీక్రెట్‌ కోడ్‌ నెంబర్‌ అడిగితే చెప్పకూడదని సూచించారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply