విచ్చలవిడి శృంగారం చేస్తే ప్రమాదకరమైన ఈ మూడు వ్యాధులు వస్తాయి

News

Loading...

విచ్చలవిడి శృంగారం ద్వారా మూడు సాధారణ అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, వీటితో జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన పునశ్చరణ నివేదికలో హెచ్చరించింది. ప్రతిఏటా 20కోట్ల మంది గనేరియా, సిఫిలిస్, క్లమిడియా లాంటి సెక్స్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాధులకు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులు వాడినా అవి తట్టుకొని వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది. ఈ రోగాలున్న వారు వైద్యులను కలిసి సరైన మందుల డోస్ ను వాడాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. గనేరియా వ్యాధి గొంతువరకు విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఆఫీసర్ టియోడోరా చెప్పారు. క్లమిడియా వ్యాధి ఉన్న రోగులు మూత్రం పోసేటపుడు విపరీతమైన మంట ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సిఫిలీస్ వ్యాధి తల్లి నుంచి శిశువులకు వ్యాపించడం వల్ల గర్భస్త మరణాలు సంభవించే ప్రమాదముందని డాక్టర్ టియోడోరా వివరించారు.

మిత్రులందరికీ షేర్ చెయ్యండి

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply