డిగ్రీ చేసిన నిరుద్యోగులకు పండగ లాంటి వార్త – ICICI లో ట్రైనింగ్ ఇచ్చి.. ఉద్యోగం ఇస్తారు.. తప్పకుండా అందరికి షేర్ చేయండి

Other

Loading...

డిగ్రీ చేసిన విద్యార్థులకు మంచి అవకాశం. ఏడాది శిక్షణ, అనంతరం ఐసీఐసీఐలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం. 12 నెలల శిక్షణ, ఇంటర్న్‌షిప్ అనంతరం జాబ్. శిక్షణ కాలానికి ఫీజు రూ. 3.15 లక్షలు లోన్ గా ఇస్తుంది ఐసీఐసీఐ బ్యాంకు.

ఐసీఐసీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏడాదిపాటు నిర్వహించే పీజీడీబీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు
ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు. ఐసీఐసీఐ బ్యాంక్, మణిపాల్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోర్సు పీజీడీబీ. ఈ కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి పీవోగా (గ్రేడ్ – 2 డిప్యూటీ మేనేజర్) నియమిస్తారు.
… ఏడాది పాటు నిర్వహించే క్లాస్‌రూం సెషన్స్, ఈ లెర్నింగ్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఆఫీసుల్లో నిర్వహించే ఇంటర్న్‌షిప్ ద్వారా శిక్షణను ఇస్తారు.
… ట్రెయినింగ్‌లో కోర్‌బ్యాంకింగ్‌పై పరిజ్ఞానాన్ని, స్కిల్స్‌ను కల్పిస్తారు. ప్రధానంగా బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, బ్యాంకింగ్ ఆపరేషన్స్, చానెల్స్ అండ్ కస్టమర్స్, రిసిప్ట్, పేమెంట్స్ తదితరాలపై శిక్షణ ఉంటుంది.
… అభ్యర్థులు స్పెషలైజేషన్స్‌లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

chudu

1. ట్రేడ్ ఫైనాన్స్
2. ప్రివిలేజ్ బ్యాంకింగ్
3. రూరల్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్
4. రిటైల్ బ్యాంకింగ్
5. ఐసీఐసీఐ నిర్ణయించిన ఇతర ప్రొఫైల్స్
శిక్షణ విధానం
… ఇది పూర్తిగా ఏడాది రెసిడెన్షియల్ ప్రోగ్రాం. ఇంటర్న్‌షిప్ కాలంలో కూడా క్యాంపస్‌లో ఉండాలి.
… టర్మ్ -1లో మూడు నెలలు బెంగళూరులోని ఐఎంఏలో క్లాస్‌రూం శిక్షణ ఇస్తారు.
… టర్మ్ -2లో రెండు నెలలు ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది.
… టర్మ్ -3లో రెండు నెలలు బెంగళూరులోని ఐఎంఏలో క్లాస్‌రూం శిక్షణ ఇస్తారు.
… టర్మ్ -4లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగ శిక్షణ ఉంటుంది.
… శిక్షణ కాలంలో స్టయిఫండ్‌ను ఇస్తారు.
… శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఐసీఐసీఐలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.

ఎంపిక విధానం
… ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, కేస్‌బేస్డ్ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ వీటన్నింటిలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌లిస్ట్‌ను తయారుచేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలు : Click Here Official Website

Loading...
Loading...

Share This Article

Leave a Reply