వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరన్నా బ్లాక్ చేసారా.. అయితే అన్ బ్లాక్ చేసుకొండి

Gadgets

Loading...

ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరు మెసేజింగ్ యాప్ వాట్సాప్ ని కూడా వాడుతుంటారు. సాధారణంగా వాట్సాప్ వాడే వారిలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వారు అధిక సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే స్కూల్ లో ఉండగానే స్మార్ట్ ఫోన్ లు వాడటం అలవాటైపోతుంది. ఇక వీరికి ఫేస్ బుక్, వాట్సాప్, యుట్యూబ్ లాంటివి లేకపోతే రోజు గడవదు. వీరిలో చాలా మంది ఓ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అదే బ్లాక్ చేయడం..!!

సాధారణంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేస్తే అన్ బ్లాక్ చేయడం కుదరదు. ఎందుకంటే ఆ అధికారం కేవలం బ్లాక్ చేసిన వారికే ఉంటుంది. ఇలా మిమ్మల్ని బ్లాక్ చేసిన వారందరినుండి వారికి తెలియకుండా అన్ బ్లాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

chudu

* ముందు మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి వారి ప్రొఫైల్ ను సందర్శించండి.

* వారి ప్రొఫైల్ పిక్చర్ మరియు వారి స్టేటస్ కనుక మీకు కనబడకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే.

* ఇప్పుడు అన్ బ్లాక్ చేసుకోడానికి ముందు మీ వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయండి.

* ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి.

* ఆ తర్వాత ఎకౌంట్స్ సెలెక్ట్ చేయండి.

* కింద మీకు డిలీట్ ఎకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నెంబర్ ఎంటర్ చేసి డిలీట్ ఎకౌంట్ పై క్లిక్ చేయండి.

* ఇప్పుడు మీ ఫోన్ లోని సెట్టింగ్స్ కి వెళ్ళండి.

* అక్కడ యప్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి.

* ఇక్కడనుండి వాట్సాప్ ను అన్ ఇంస్టాల్ చేయండి.

* అన్ ఇంస్టాల్ అయిన తర్వాత మీ ఫోన్ ని రీస్టార్ట్ చేయండి.

* ఇప్పుడు కొత్తగా మరోసారి వాత్సప్ ను ఇంస్టాల్ చేయండి.

* అది అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంతే.

* ఇలా చేస్తే చాలు.. మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారో వారందరి బ్లాక్డ్ లిస్టు నుండి మీరు తొలగిపోతారు.

Loading...
Loading...

Share This Article

Leave a Reply