పాన్‌కార్డును ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ లో ఎలా దరఖాస్తు చేయాలి

Other

Loading...

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ పాన్‌కార్డు తప్పనిసరి. బ్యాంకు లావాదేవీలు, ఆదాయపన్ను, రు ణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, డీమ్యాట్‌ అకౌంట్‌ లాంటి నిర్వహణకు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని పొందాలంటే ఏం చేయాలి..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో..? తెలుసుకోండి.

దరఖాస్తు రెండు రకాలు

ఒకటి ఆన్‌లైన్‌, మరొకటి ఆఫ్‌లైన్‌. మీరు ఇటీవల తీసుకున్న రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గుర్తింపు కార్డులు(సెల్ఫ్‌ అటెస్టేషన్‌), జనన ధ్రువీకరణ పత్రాలు(అటెస్ట్‌ చేసినవి)ను జతచేయాలి.

chudu

ఆన్‌లైన్‌ విధానంలో
 • ఇంటర్నెట్‌లో హెచ్‌టీటీపీ స్లాష్‌ టిన్‌ డాట్‌ టిన్‌ డాట్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌ కామ్‌ స్లాష్‌ పాన్‌ స్లాష్‌ ఫామ్‌49ఏ డాట్‌ హెచ్‌టీ ఎమ్‌ లింక్‌( http/tin.tin.nsdl.com/pan/form49Ahtm )ను క్లిక్‌ చేయాలి.
 • ఇక్కడ మీకు పాన్‌కార్డు దరఖాస్తు ప్రత్యక్ష మవుతుంది. ఇందులో మీ వివరాలు నమోదు చేయాలి
 • స్టార్‌ గుర్తు ఉన్న వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ వివరాలు అన్నీ నమోదు చేశాక పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. ఇక్కడ డిమాండ్‌ డ్రాఫ్ట్‌, నెట్‌ బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పేమెంట్‌ విధానంలో రుసుము చెల్లించవచ్చు.
 • రూ.93తోపాటు 12.36 శాంత సర్వీస్‌ టాక్స్‌ ఉంటుంది.
 • నెట్‌ బ్యాంకింగ్‌లో చెల్లిస్తే నాలుగు శాతం, క్రెడిట్‌, డెబి ట్‌ కార్డు ద్వారా చెల్లిస్తే రెండుశాతం అదనపు చార్జీలు వసూ లు చేస్తారు.
 • పేమెంట్‌ పూర్తయ్యాక మీ వివరాలతో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారం వస్తుంది. దీన్ని ప్రింట్‌ తీసుకోవాలి. ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారంలో నిర్ధేశిత ప్రాంతంలో సంతకం చేసి కావాల్సిన వివరాలను పూర్తి చేయాలి.
 • ఇందులో మీ రెండు ఫొటోలను నిర్ధేశిత బాక్స్‌లో అతికించి సంతకం చేయాలి.
 • ఇప్పుడు ఈ అక్నాలెడ్జ్‌మెంట్‌ ఫారంతో పాటుగా అడ్రస్‌, గుర్తింపు కార్డులను జత చేయాలి.
 • ఒక ఎన్వలప్‌ కవర్‌పై అప్లికేషన్‌ ఫర్‌ న్యూపాన్‌ రిక్వెస్ట్‌ అని రాసి మీరు పొందిన ఎక్నాలెడ్జ్‌మెంట్‌ నంబరు తెలియ చేయాలి.
 • ఆ కవర్‌ను ఇన్‌కమ్‌ టాక్స్‌ పాన్‌ సర్వీస్‌ యూనిట్‌, ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ-గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌, ప్లాట్‌ నెంబరు 347, ఐదో అంతస్తు, సర్వే నెంబరు 997-8, మోడల్‌ కాలనీ, పూణె-411016 చిరునామాకు పోస్ట్‌ చేయాలి.
 • దరఖాస్తు అందిన 15 రోజుల్లో పాన్‌కార్డు వస్తుంది.
 • పాన్‌కార్డు రావడానికి ఆలస్యమైతే మీ పాన్‌కార్డు స్టేటస్‌ను హెచ్‌టీటీపీ స్లాష్‌ టిన్‌ డాట్‌ టిన్‌ డాట్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌ కామ్‌ స్లాష్‌ పాన్‌ స్లాష్‌ ఫామ్‌49ఏ డాట్‌ హెచ్‌టీ ఎమ్‌ లింకు ద్వారా తెలుసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌ విధానంలో..
 • ఫారం-49ని పూరించాలి
 • ఇంటర్నెట్‌లో హెచ్‌టీటీపీ స్లాష్‌ టిన్‌ డాట్‌ టిన్‌ డాట్‌ ఎన్‌ఎస్‌డీఎల్‌ డాట్‌ కామ్‌ స్లాష్‌ పాన్‌ స్లాష్‌ ఫామ్‌49ఏ డాట్‌ హెచ్‌టీ ఎమ్‌ లింకుద్వారా ఫారం పొందవచ్చు.
 • దరఖాస్తు పూరించే ముందు నిబం ధనలు శ్రద్దగా చదవాలి.
 • మీరు అతికించే ఫొటోలు స్పష్టంగా ఉండాలి. అదే మీ పాన్‌కార్డపై ముద్రిస్తారు.
 • సంతకం కూడా సరిగా పెట్టాలి. అది కూడా కార్డుపై ముద్రిస్తారు.
 • పూరించిన దరఖాస్తును పాన్‌ సర్వీస్‌ సెంటర్‌లో అందించాలి.
 • ఈ సెంటర్లు అన్ని ప్రాంతాల్లో ఉంటాయి.
 • ఇంకెందుకు ఆలస్యం… ఎంతో అవసరం, ఉపయోగకరమైన పాన్‌కార్డుకు అందరూ దరఖాస్తు చేసుకోండి. భవిష్యత్‌లో ఇది గు ర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడనున్నది.

Loading...
Loading...

Share This Article

Leave a Reply