కేంద్రం మరో షాక్.. రద్దైన పాత నోట్లు మీ దగ్గర ఉంటే ఇంకా తప్పదు భారీ మూల్యం

News

Loading...

కేంద్రం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రద్దైన పెద్ద నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే తుది గడువు డిసెంబర్ 30తో ముగియనుంది. ఆ తర్వాత ఈ నోట్లు ఏ మాత్రం చెల్లుబాటు కావని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. డిసెంబర్ 30 తర్వాత ఎవరి వద్దైనా రూ.500, రూ.1000 పాత నోట్లు ఉంటే భారీగా జరిమానా విధించనున్నారు.
రద్దైన పాత పెద్ద నోట్లు డిసెంబర్ 30 తర్వాత పది వేలకుపైగా కలిగి ఉన్నా, ఎవరికైనా ఇచ్చినా, తీసుకున్నా చట్టరిత్యా నేరం. దీనిపై రూ.50,000 ఫైన్ లేదా ఎంత డబ్బులుంటే దానికి ఐదు రెట్ల జరీమానా విధించే అవకాశముంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా కేంద్రం దీనిపై ఓ ఆర్డినెన్స్ చేసి ప్రకటన చేయవచ్చని సమాచారం.

Loading...
Loading...

Share This Article

Leave a Reply