తిండి లేక 5రూ. మ్యాగీతో ఏడాది గడిపి ఈ స్థాయికి చేరిన క్రికెటర్

Sports

Loading...

టీ-20 ప్రపంచ్ కప్ లో భారత్ బంగ్లాదేశ తో తలపడుతున్నది. ఇక అందరూ భారత్ గెలుపు మీద ఆశలు వదిలేసుకొన్న వేళ… భారత్ ప్రజల ఆశలను తన భుజాన మోస్తూ.. బౌలింగ్ చేస్తోన్న వ్యక్తి లాస్ట్ ఓవర్ లో మూడు బాల్స్ కు ఇక రెండు పరుగులు చేస్తే బంగ్లా దేశ్ గెలుపు.. ఇక అభిమానులు గెలుపుపై ఆశలు వదిలేసుకొన్న సమయంలో ఓవర్ లో బాలుగో బాల్ వికెట్, ఐదో బాల్ వికెట్ ఇక లాస్ట్ బాల్ కి రెండు పరుగులు కెప్టెన్ సూచనని తూచా తప్పకుండా బాల్ వేసి భారత్ ను గెలుపు ముంగిట సగర్వంగా నిలబెట్టిన హార్ధిక్ పాండ్యా… ఇప్పుడు చాలా ఫేమస్ క్రికెటర్. కానీ అతను పుడుతూనే గోల్డెన్ స్పూన్ ను నోట్లో పెట్టుకొని పుట్టలేదు.. తినడానికి తిండి లేదు.. సరైన వసతి లేదు.. కానీ క్రికెట్ అంటే ప్రాణం దానికోసం ఎంతో కష్ట పడ్డాడు.. చివరకు తాను అనుకొన్నది సాధించాడు. ఈ తరానికి ఆదర్శ యువకుడిగా నిలబడ్డాడు.
తినడానికి తిండి లేని ఓ యువకుడు 9వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంగ్లీష్ పై పట్టు సాధించాడు. ఎందుకు ఇంగ్లీష్ ను ఇంత పట్టుదలగా నేర్చుకుంటున్నవంటే రేపు నేను గొప్పవాడిని అయ్యాక ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని చెప్పాడు. చెప్పడమే కాదు తను తనకిష్టమైన క్రికెట్ ఆటలో గొప్పవాడు కావడం కోసం ఎన్నింటినో వదులు కున్నాడు. చివరకు సాధించాడు. ఒక సంవత్సరం ఐదు రూపాయల మ్యాగీతోనే కడుపు నింపుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం క్రికెట్ ఆడిన హార్ధిక్ ఇప్పుడు ఇండియా క్రికెట్ టీం లో చోటు సంపాదించే వరకూ చేసిన జర్నీ ప్రతి యువకుడికి ఆదర్శం.
హార్ధిక్ ఆటను చూసిన సచిన్ నీవు ఇండియా కోసం ఏడాది లోపులో ఆడతావు అని అన్నాడు. కానీ ఏడాది కాకుండానే ఇండియా క్రికెట్ సభ్యుడిగా చోటు సంపాదించుకొన్నాడు. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకొన్నాడు. ఈ సందర్భం లో హార్ధిక్ మాట్లాడుతూ.. నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తం ముంబై ఇండియన్స్ నన్ను కొనుగోలు చేసి ఇచ్చిన పది లక్షల చెక్కు.. ఈ ఒక్క చెక్కుతో మా కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పాడు. ప్రస్తుతం కీలక ఆల్ రౌండర్ గా ఎదుగుతున్న హార్ధిక పాండ్యా మెరుపులాంటి ఫీల్డింగ్, పొదుపు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయడం లో కూడా దిట్ట.. దీంతో భారత్ కు ఆల్ రౌండర్ గా హార్ధిక్ పాండ్యా ఫేవరెట్ ప్లేయర్. బంగ్లాదేశ్ తో హార్ధిక్ వేసిన లాస్ట్ ఓవర్ ప్రపంచానికి అతనిని పరిచయం చేసింది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply