అద్దె ఇళ్ళలో ఉంటున్నవారికి పండగలాంటి వార్త – తప్పక చదవండి

Telugu World

Loading...

ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన తరువాత బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించడంతో, ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకు రావడంతో దీని ప్రభావం చాలా రంగాలపై పడనుంది. ముఖ్యంగా నగరాల్లో అద్దెకు ఉండేవారికి ఇదో వరం కానుందని సమాచారం. చాలా మంది రెండు మూడు ఇళ్ళు కట్టుకొని ఒకదానిలో వారు నివసిస్తూ మిగతా ఇళ్ళు అద్దెకు ఇస్తుంటారు. గత కొంత కాలంగా నగరాలలో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. నోట్ల రద్దు తర్వాత ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సి రావటమే కాకుండా.. బినామీ ఆస్తులపైనా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈక్రమంలో అద్దెపై వచ్చే ఆదాయాన్ని లెక్కల్లో చూపితే పన్ను పడుతుంది.

కొంత మంది పన్ను పరిధిని పెంచుకోవటం ఇష్టం లేక.. అద్దెను తగ్గించి చూపితే సరిపోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నారంట. కనీసం 20శాతం అద్దెలు తగ్గుతాయని అనుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇంటి అద్దెలు తగ్గనున్నాయా అంటూ హాట్ డిస్కషన్ లు అవుతున్నాయి. అంతే కాకుండా కమర్షియల్ షాప్స్ కూడా అద్దె తగ్గుతాయని అనుకుంటున్నారు. ఎందుకంటే నోట్ల రద్దు తరవాత వ్యాపారాలు కూడా చాలా వరకు డౌన్ అవ్వడం వలన ఇంతకు ముందులా అంతంత అద్దెలు ఇవ్వలేరని… ఖచ్చితంగా తగ్గు ముఖం పట్టాలని అనుకుంటున్నారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply