జిడ్డుగా ఉన్నజుట్టుకు తొలగిచే 7 బెస్ట్ హోం రెమెడీస్ ..!

Other

Loading...

ఎన్నిసార్లు తలస్నానం చేసినా, ఎన్ని షాంపులు మార్చినా తల జిడ్డుగానే కనబడుతున్నదా..? జిడ్డుగాఉన్నజుట్టుకు షాంపు ఒకటే మార్గం కాదు. తలలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలలో ఎక్సెస్ ఆయిల్, జిడ్డును తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

ఆల్రెడీ జిడ్డుతో ఉన్న జుట్టును నివారించుకోవడానికి షాంపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉండదు. తలలో జిడ్డును తొలగించుకోవడానికి ఎవరైనా షాంపునే ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. అయితే ఇలా ఎక్కువ షాంపు చేయడం వల్ల తలలో జిడ్డు తక్కువగా కనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో జిడ్డు వల్ల జుట్టు ఎక్కువ డ్యామేజ్ అవ్యొచ్చు.

chudu

జిడ్డును తొలగించుకోవడానికి ఎక్కువ షాంపును వాడటం వల్ల తలలో కేశాలలో నేచురల్ ఆయిల్స్ ను కోల్పోతుంది. చివరకు జుట్టు చిట్లడం, జుట్టుకు తిరిగి నేచురల్ ఆయిల్స్ పొందకపోవడం వల్ల జుట్టు నిర్జీవంగా కనబడుతుంది.

తలలో జిడ్డు నివారించడానికి కొన్ని అమేజింగ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ట్రై చేసి టెస్ట్ చేసిన హోం రెమెడీస్. అంతే కాదు, ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

టీ: బ్లా అండ్ గ్రీన్ టీ రెండింటిని తలకు ఉపయోగించుకోవచ్చు.ఇది తలలో చల్లదనం కలిగస్తుంది. లైటర్ హెయిర్ కలర్ ఉన్న వారు గ్రీన్ టీ ను తలకు అప్లై చేయొచ్చు. బ్లాక్ టీని తలారా పోసుకోవాలి. . గ్రీన్ టీతో తలకు మసాజ్ చేసిన తర్వాత బ్లాక్ టీతో తలస్నానం చేయాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్: జిడ్డుగా ఉన్న జుట్టుకు ఇది ఒక మిరాకిల్ హోం రెమెడీ. ఒక కప్పు నీటిలో కొద్ది వెనిగర్ ను తీసుకుని మిక్స్ చేయాలి . దీన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది తలలో జిడ్డును మాత్రమే కాదు, చుండ్రు నివారించడంలో కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది.

టీట్రీ ఆయిల్ : రెగ్యులర్ షాంపులో కొద్దిగా టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. టీట్రీ ఆయిల్ నేచురల్ యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినది. అంతే కాదు ఇది తలలో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. గ్రీసి హెయిర్ కు ఇది బెస్ట్ హోం రెమెడీ.

అలోవెర జెల్ : తలలో జిడ్డును నివారించడానికి ఫర్ఫెక్ట్ నేచురల్ హోం రెమెడీ, అలోవెర జెల్ ను తలస్నానం చేయడానికి ముందు అలకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయడం వల్ల ఇది తలలో జిడ్డు తొలగిస్తుంది. తలకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

వేప: వేప ఆకులకు కొద్దిగా నీరు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. తర్వాత తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. వేపఆకును చాలా రకాల షాంపులలో వినియోగిస్తున్నారు . ఎందుకంటే ఇందులో యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ లణాలు ఎక్కువగా ఉన్నాయి కనుక.

బేకింగ్ సోడ: బేకింగ్ సోడాను నేచురల్ షాంపు వలే ఉపయోగించుకోవచ్చు. అరకప్పు నీటిలో బేకింగ్ సోడను మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, తలకు షాంపులా ఉపయోగించుకోవచ్చు . జిడ్డు జుట్టును నివారించడంలో ఇది బెస్ట్ హోం రెమెడి.

నిమ్మరసం: నిమ్మరసం గ్రేట్ బ్లీచింగ్ ఏజెంట్. తలలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది . ఇంకా ఎక్కువ సెబమ్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. నిమ్మరసంను తలకు అప్లై చేసి15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

Loading...
Loading...

Share This Article

Leave a Reply