రాష్ట్రపతి నుంచి సీఎంలు, ఎమ్మెల్యేలు రాజకీయనేతలకు ఎవరెంత జీతాన్ని తీసుకుంటున్నారో ఓ సారి చూద్దాం.

Other

Loading...

రాష్ట్రపతి నుంచి రాజకీయనేతలకు ఎవరెంత జీతాన్ని తీసుకుంటున్నారో ఓ సారి చూద్దాం.
నెలవారీ వేతనాలు:
రాష్ట్రపతి: రూ.1,50,000/-
ఉపరాష్ట్రపతి: రూ.1,25,000/-
గవర్నర్: రూ.1,10,000/-
ఢిల్లీ
ముఖ్యమంత్రి: రూ.1,20,000/-
మంత్రులు: రూ.1,20,000/-
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: రూ.88,000/-
మంత్రుల వేతనాలు రూ.3,20,000లకు, ఎమ్మెల్యేల వేతనాలు రూ.2,10,000లకు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించాల్సివుంటుంది.
మహారాష్ట్ర(వేతనాల అంచనా)
ముఖ్యమంత్రి: రూ.2,25,000/-
మంత్రులు: రూ.2,05,000/-
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: రూ.1,70,000/-
మంత్రుల వేతనాలను 250 శాతం, ఎమ్మెల్యేల వేతనాలను 126శాతం పెంచూతూ మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లును పాస్ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయి. అయితే రాష్ట్రపతి, గవర్నర్ ల బేసిక్ శాలరీలను మించకుండా వాటిని బేసిక్ పేను ఉంచుతారు.
తెలంగాణ
ముఖ్యమంత్రి: రూ.4,21,000/-
ఎమ్మెల్యేలు: రూ.2,50,000/-
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి: రూ.2,40,000/-
ఎమ్మెల్యేలు: రూ.1,25,000/-
తమిళనాడు
ముఖ్యమంత్రి: రూ.1/-
ఎమ్మెల్యేలు: రూ.55,000/-
సమావేశాలకు హాజరైనందుకు రోజుకు రూ.500లు అలవెన్సుగా ఇస్తారు. ఏడాదిలో రెండు సార్లు ట్రైన్ అలవెన్సు కింద ఎమ్మెల్యేలు అందరికీ రూ.20,000/-లు ఇస్తారు.
పశ్చిమబెంగాల్
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మమతా బెనర్జీ ఎలాంటి వేతనాన్ని తీసుకోరు. నెలవారీ వచ్చే వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తారు. మమత ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా వేతనంగా తీసుకోలేదు.
ఎమ్మెల్యేలు: 42,000/-
ఉత్తరాఖండ్
ముఖ్యమంత్రి: రూ. 2,50,000/-
ఎమ్మెల్యేలు: రూ. 1,60,000/-
ఉత్తరప్రదేశ్
ముఖ్యమంత్రి: రూ.1,01,000/-
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు: రూ.75,000/-
మధ్యప్రదేశ్
ముఖ్యమంత్రి: రూ. 2,00,000/-
ఎమ్మెల్యేలు: రూ.1,10,000/-

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply