వాట్సప్‌లో అది క్లిక్ చేస్తే మీ కొంప కొల్లేరు అవుతుంది

Gadgets

Loading...

ఈ మధ్య వాట్సప్ లో ఓ మెసేజ్ తెగ హల్‌చల్ చేస్తోంది. వాట్సప్ ఇప్పుడు గోల్డ్ కలర్ లో వస్తోంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే మీరు మీ వాట్సప్ ని గోల్డ్ కలర్ లోకి మార్చుకోవచ్చు అని.
ఇది వాట్సప్ కొత్తగా పెట్టిన అప్ గ్రేడ్ వర్షన్ అంటూ వాట్సప్ లో వెంటనే దీన్ని డౌన్ లోడ్ చేసుకోండని ఓ మెసేజ్ అందరికీ వస్తోంది. అయితే ఈ మెసేజ్ అంతా ఫేక్ తో కూడుకున్నది. మీరు దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నారంటే మీ ఫోన్ లోకి 404 మెసేజ్ వస్తుంది అంటే మీ అకౌంట్ హ్యాక్ అయి మీ మొబైల్ డేటా సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది.
ఇదొక పెద్ద స్కాం అని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాట్సప్ ఏదైనా రిలీజ్ చేస్తే అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుందని ఇలాంటి మెసేజ్ లు నమ్మవద్దని వాట్సప్ సైతం చెబుతోంది.
సో మీరు ఆ మెసేజ్ వస్తే ఓపెన్ చేయకండి. మీ కొంప కొల్లేరు చేసుకోకండి. వాట్సప్ లో మీకు తెలియని ట్రిక్స్ చాలానే ఉన్నాయి. అవేంటో చూడండి.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply