అల్లుఅర్జున్ దంపతులు కూతురికి ఏమి పేరు పెట్టారో తెలిస్తే మీరు షాక్ అవుతారు

News

Loading...

హీరో అల్లు అర్జున్ తన ముద్దులొలికే కూతురికి నామకరణం చేశాడు. తమ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన దేవత పేరు అర్హ అని ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో అల్లుఅర్జున్ పోస్ట్ చేశాడు. అర్హ అనే పేరుకు అర్థాన్ని కూడా అల్లు అర్జున్ వివరించాడు. హిందుత్వంలో శివుడు, ఇస్లామిక్‌లో ప్రశాంతత, నిర్మలం అని అర్థమని పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ పేరులో మరో స్పెషాలిటీ కూడా ఉంది. అల్లు అర్జున్ పేరులోని అర్జున్‌లో ఏఆర్‌‌ అనే ఆంగ్ల పదాలను, అతని భార్య స్నేహ పేరులోని చివరి రెండు ఆంగ్ల అక్షరాలు హెచ్‌ఏను కలిపి అర్హ అని నామకరణం చేశారు. ఇలా తన కూతురికి పేరు పెట్టడంలో కూడా బన్నీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Loading...
Loading...

Share This Article

Leave a Reply