బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

News

Loading...

కేవలం రూ.49ల నెలసరి అద్దెతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సేవలు అందించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ కందగట్ల నరేందర్‌ తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్‌ ములుగురోడ్‌లోని భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) భవన్‌లోని పీజీఎం చాంబర్‌ ఆవరణలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పీజీఎం నరేందర్‌ మాట్లాడారు. నెలసరి రూ.49లకే అద్దె ప్రాతిపదికన టెలిఫోన్ పథకంలో భాగంగా ఆరు నెలల వరకు సేవలు పొందవచ్చని సూచించారు. ఈ సౌకర్యం పొందేందుకు గానూ వినియోగదారులు ముందస్తుగా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద( రిఫండబుల్‌)రూ. 500లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన టెలిఫోన్ కేబుల్‌ సదుపాయం కలిగిన ప్రాంతాల్లో వినియోగదారులకు టెలిఫోన్ అమర్చుతారు.

           దీంతో వియోగదారుడు ప్రతీ ఆదివారం దేశంలోని ఏ నెట్‌ వర్క్‌కైనా అపరిమితంగా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని, దీనికి తోడు ప్రతీ రోజు రాత్రి 9గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అపరిమితంగా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా రూ.470 రూపాయలకే కోంబో ప్లాన్ కింద ల్యాండ్‌ఫోన్, 10జీబీ వరకు 2ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వీరహనుమాన్లు, ఏజీఎం సేతుమాధవరావు, డీఈ ఎల్‌.సుధాకర్‌, జేటీవో కె.సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply