ఇలా చేయండి.. బైక్ మైలేజ్ లీటర్‌కు 100 kms పొందండి

Telugu World

Loading...

మనపై మనకు నమ్మకం ఎలా ఉంటాలంటే…అక్షరాల ఈ అబ్బాయికి తనపై తనకు ఉన్నంత నమ్మకమంత ఉండాలి. నందిగాంకి చెందిన గునితి గిరిబాబు కొత్త ఆలోచనతో ఏడాదిన్నర శ్రమతో ద్విచక్రవాహనం (హీరోహోండా సీడీ100) మైలేజ్‌ పెంచి అందరిలో ఆసక్తి పెంచారు. తల్లి యశోద వ్యవసాయ కూలీ, తండ్రి బాబూరావు టైలర్‌గా ఉంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. అయితే కుటుంబ పోషణ కష్టతరంగా ఉండడంతో పదో తరగతి వరకే విద్యను అభ్యసించి తద్వారా కుటుంబానికి చేదోడు అవ్వాలనే ఉద్దేశ్యంతో గిరిబాబు విద్యకు స్వస్తిచెప్పి బైక్‌ మెకానిక్‌గా ఎదగాలని ముందుకు వచ్చాడు. దీంతో టెక్కలికి చెందిన బైక్‌మెకానిక్‌ దుర్యోధన వద్ద ఏడేళ్ల పాటు ఉండి పూర్తిస్థాయిలో బైక్‌ మరమ్మత్తులో అవగాహన పెంపొందించుకొని స్వతహాగా నందిగాంలో మెకానిక్‌ షాప్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక జాతీయరహదారి అండర్‌పాసేజ్‌ సమీప సత్యసాయి ప్రశాంతి మందిరం పరిధిలో మెకానిక్‌షెడ్‌ను రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా సీడీ100 వాహనం మైలేజ్‌ 50 నుంచి 60 వరకు ఉండేదని, దాన్ని 80 నుంచి 100వరకు మైలేజ్‌ వచ్చే విధంగా తయారుచేసే ఉద్దేశంతో వాహనానికి అదనంగా మరో నాలుగు చైన్‌వీల్స్‌ పొందుపరిచి లక్ష్యాన్ని సాధించారు. ఇది గమనించిన వాహన చోదకులు ఆశ్చర్యం పొందడమే కాకుండా గిరిబాబు ఆలోచనకు సెల్యూట్‌ చెప్పడం కనిపించింది. వాహనం తయారీ కఠోరంగా విశాఖ నుంచి వస్తువులు రప్పించి ఆలోచనకు పదును పెట్టడంతో ఆనందాన్ని పలువురు వ్యక్తపరిచారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply