పెళ్లి చేసుకోను సహజీవనం బెస్ట్ అంటున్న హీరోయిన్

News

Loading...

నికిషా పటేల్.. ఈ పేరు పవన్ కళ్యాణ్ నటించిన ‘పులి’ సినిమా చూసిన వారందరికి సుపరిచితమే. పులి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో కోలీవుడ్‌కు యూటర్న్ తీసుకుంది. అయితే తమిళ ప్రేక్షకుల్లో బాగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తమిళంలో చేసింది ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే. ‘తలైవన్’ తో తమిళ ప్రేక్షకులకు పరిచయమై ‘ఎన్నమో ఏదో’, ‘కరైఓరం’, ‘నారదన్’ చిత్రాలతో ఒకింత సక్సెస్‌‌‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఎలాగైనా టాలీవుడ్‌లోనే మంచి సక్సెస్‌‌లతో నిలదొక్కుకోవాలని కంకణం కట్టుకున్న ఈ భామ చాలా గ్యాప్ తర్వాత ‘అరకు రోడ్‌’ సినిమా‌లో అందాలు ఆరబోసింది.. అయినా పెద్దగా హిట్ కాలేదు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ మీడియాతో మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేసింది. మామూలుగా హీరోయిన్లు సహజీవనం, పెళ్లి, మాటెత్తితే మారుమాట చెప్పకుండా తప్పించుకుంటారు. అయితే నికిషా మాత్రం.. మిగతా హీరోయిన్లకు విరుద్ధం. మీడియా మిత్రులు పెళ్లి విషయం ప్రస్తావించగా.. ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. అయితే భార్యాభర్తలుగా జీవించేందుకు పెళ్లి బంధం అక్కర్లేదన్నదే నా అభిప్రాయం. పెళ్లితో వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్న నమ్మకం లేదు. 2030 సంవత్సరానికల్లా మన దేశంలో పెళ్లి అనే బంధం స్థానంలో సహజీవన శైలి పెరుగుతుందని నమ్ముతున్నా. నాకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేస్తానని చెప్పింది నికిషా.

Loading...
Loading...

Share This Article

Leave a Reply