ఆసుపత్రిలో ఉన్న తండ్రి పై కూతురు ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా వణికిపోతారు

News

Loading...

తండ్రని ఆలోచించలేదు కదా కనీసం మానవత్వం అనే మాటను కూడా మరచిపోయింది ఓ కూతురు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని ఆస్తి కోసం చంపే ప్రయత్నం చేసింది. ఆమె ఓ డాక్టర్. పేరు జయసుధ. ఆసుపత్రికి ఇద్దరు కొడుకులతో వచ్చింది. తండ్రితో మాట్లాడాలని అక్కడే ఉన్న ముగ్గురు నర్సులను బయటకు పంపించింది. ఎవరికీ కనపడకుండా తెచ్చిన ఆస్తి డాక్యుమెంట్స్‌పై సంతకం చేయాలని తండ్రిని బలవంతపెట్టింది. డాక్యుమెంట్స్‌పై తండ్రి సంతకం పెట్టడానిక నిరాకరించాడు. అంతే.. డాక్యుమెంట్స్‌పై సంతకం పెట్టించే క్రమంలో తండ్రి పట్ల కూతురు వ్యవహరించిన తీరు అత్యంత క్రూరంగా ఉంది. పేషేంటుకు ఎక్కుతున్నఐ.వి.(మెడిసిన్ బాటిల్‌)ను కత్తిరించేసింది. అంతటితో ఆగకుండా ఆక్సిజన్ మాస్క్‌ని తొలగించేసింది. చేతినుంచి రక్తం కారుతున్నా ఏమాత్రం చలించలేదు. కనికరం లేకుండా డాక్యుమెంట్స్‌పై సంతకం పెట్టించుకుంది. లోనికి వచ్చిన ముగ్గురు నర్సులు రక్తం చూసి బయటకు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజిని హాస్పిటల్ యాజమాని, జయసుధ సోదరుడు డా.జయప్రకాశ్ ఇటీవలే బయటపెట్టాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు జయసుధా రాక్షసత్వాన్ని మీడియాకు వివరించారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply