వొడాఫోన్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఆఫర్‌

News

Loading...

ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఇండియా తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి నుంచి రోమింగ్ చార్జీలను ఎత్తివేయనున్నట్టు పేర్కొంది. అంటే ఇక నుంచి ఎటువంటి రోమింగ్ చార్జీలు లేకుండానే ఏ రాష్ట్ర వినియోగదారులైనా ఇన్‌కమింగ్ ఫోన్లు అందుకోవచ్చన్నమాట. రోమింగ్‌లో ఉన్నప్పుడు చార్జీలు వర్తిస్తాయన్న బాధను మర్చిపోయి స్వేచ్ఛగా ఫోను మాట్లాడుకోవచ్చని, ఉచితంగా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఔట్ గోయింగ్ కాల్స్ మాత్రం అక్కడి చార్జీలకు అనుగుణంగా ఉంటాయని వొడాఫోన్ ఇండియా కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా తెలిపారు. కాగా గతనెలలో ప్రిపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ‘ఆల్ ఇన్ వన్’ రోమింగ్ ప్యాక్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లోకల్ టాక్ టైమ్, ఎస్టీడీ, ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ నిమిషాలను ఒకే రీచార్జ్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది ఢిల్లీతోపాటు నేషనల్ కేపిటల్ రీజియన్‌కు మాత్రమే పరిమితం చేసింది.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply