జియో 4జీ సిమ్‌ కస్టమర్లకు మరో బంపర్ వెల్‌ కమ్ ఆఫర్ – తప్పక చదవండి

News

Loading...

ప్రముఖ టెలికాం రిలయన్స్ సంస్థ నుంచి తాజాగా జియోను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి కూడా యూజర్స్ అంతా జియో జపం చేశారు. దీంతో వారిని మరింత ఉత్సాహపరచడానికి మరో ఆఫర్ ను అతి త్వరలోనే ప్రకటించనుంది. జియో తన వెల్‌ కమ్ ఆఫర్‌ను మార్చి 2017 వరకు పొడిగించనుందంటూ గత కొంత కాలంగా అనేక రూమార్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే డిసెంబర్ 3వ తేదీ కంటే ముందు జియో 4జీ సిమ్‌ ను కొనుగోలు చేసిన వారికి మాత్రమే వెల్‌ కమ్ ఆఫర్ వర్తిస్తుందని కొద్ది నెలల క్రితం జియో అనౌన్స్ చేసిన ప్రకటించింది. దీంతో డిసెంబర్ 3వ తేదీ తరువాత జియో సిమ్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి అనే దాని పైనే ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు

chudu

అయితే..తాజాగా ఈ వెల్‌ కమ్ ఆఫర్ 2 పేరుతో జియో సరికొత్త ఆఫర్‌ ను డిసెంబర్ 3వ తేదీన మార్కెట్లో అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టెలికం ఆపరేటర్లు అందించే ప్రమోషనల్ ఆఫర్స్ కేవలం 90 రోజులు మాత్రమే వ్యాలిడిటీని కలిగి ఉండాలన్న ట్రాయ్ నిబంధనల నేపథ్యంలో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మరో వైపు..జియో ఆఫర్ చేయబోయే వెల్‌ కమ్ ఆఫర్ 2 కూడా 90 రోజుల వ్యాలిడిటీతో రానుందట. ఈ ఏడాది చివరి కల్లా 100 మిలియన్ యూజర్లకు రాబట్టుకునే టార్గెట్ పెట్టుకున్న జియో, ఈ ఆఫర్‌ను మరింత విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
ఇక జియో లాంచ్ చేయబోయే కొత్త వెల్‌ కమ్ ఆఫర్ 2 అందరికీ కాదు. డిసెంబర్ 3 తరువాత జియో సిమ్‌ను కొనుగోలు చేసిన కొత్త కస్టమర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుందట.సెప్టంబర్ 5న లాంచ్ చేసిన మొట్టమొదటి వెల్‌ కమ్ ఆఫర్ ముందుగా ప్రకటించిన విధంగానే డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వీళ్లు జనవరి 1, 2017 నుంచి జియో అందుబాటులో ఉంచిన ఏదో ఒక ప్లాన్‌ కు మైగ్రేట్ కావల్సి ఉంటుందట.

Loading...
Loading...

Share This Article

Leave a Reply