ఎయిర్‌టెల్ కస్టమర్లకు 3 నెలలు పాటు అన్‌లిమిటెడ్‌ 4G డేటా

News

Loading...

రిలయన్స్‌ జియో నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించే సరికొత్త పథకాలు తీసుకురావడంపై ఇతర టెలికాం కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. తాజాగా భారత్ ఎయిర్‌టెల్‌ 1,495 రూపాయలకే 3 నెలలపాటు అన్‌లిమిటెడ్‌ డేటాను అందించే 4జి ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను ప్రకటించింది. ఇందు లో 30 జిబి వరకు 4జి వేగం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుత వినియోగదారులు 1,495 రూపాయలకు ఈ ప్యాక్‌ ను పొందవచ్చు. కొత్త వినియోగదారులు అయితే 1,494 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాక్‌తో ఎయిర్‌టెల్‌ కూడా ఒక జిబి డేటా ను 50 రూపాయలకే ఆఫర్‌ చేసినట్టవుతుంది. ఈ ప్యాక్‌ కింద 30 జిబిల వరకు 90 రోజులపాటు అధిక వేగంతో డేటాను పొందవచ్చని, డేటా పరిమితి దాటిన తర్వాత ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటాయని, అప్పుడు 2జి వేగమే ఉంటుందని కంపెనీ ఆపరేషన్స్‌ (ఇండియా, దక్షిణాసియా) డైరెక్టర్‌ అజయ్‌ పూరి తెలిపారు.
4జి హ్యాండ్‌సెట్లు కలిగిన కస్టమర్లు అధిక డేటాను వినియోగించుకుంటారని, ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే ఈ ప్యాక్‌ను తెచ్చినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ డేటా ప్యాకేజ్‌ ఢిల్లీలో అందుబాటులో ఉందని, కొన్ని రోజుల్లోనే అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.

chudu

Loading...
Loading...

Share This Article

Leave a Reply