కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గాలంటే….ఇంటి చిట్కాలు

Telugu World

Loading...

సాదారణంగా కడుపు ఉబ్బరం వచ్చిందంటే చాలా చిరాకు, అసౌకర్యం ఉంటుంది. దీనిని మనం ఇంటిలో ఉండే సహజ పదార్దాలతో తగ్గించుకోవచ్చు. ఈ పదార్దాలను మన రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా బాగా సహాయపడతాయి.
కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు చేదుగా ఉండే ఆహారం తింటే మంచిది. ఇవి శరీరంలోని నీటిని తగ్గించి ఎంజైమ్స్‌ని బాగా ఉత్పత్తి చేస్తాయి. జీర్ణక్రియ బాగా జరిగేలా సహాయపడతాయి . కాలేయం బాగా పనిచేసేలా చేస్తాయి. దాంతో శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. ఉబ్బరంగా ఉన్నప్పుడు గ్రీన్‌ టీ తాగొచ్చు. వాల్‌నట్స్‌, దాల్చిన చెక్క తింటే మంచిది.
మెంతులు కూడా జీర్ణశక్తికి ఎంతో మంచిది. అలాగే ప్రతి రోజూ కొన్ని తులసి ఆకులను నమలాలి. తినే పదార్థాల్లో పసుపు వాడాలి. వారంలో రెండు మూడు రోజులు కాకరకాయ కూర లేదా కాకర జ్యూసు తీసుకుంటే మంచిది. అలాగే దానిమ్మ, యాపిల్‌, కాయధాన్యాలు,మొలకలు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఒక స్పూను మించి ఉప్పును వాడకూడదు.

Loading...
Loading...

Share This Article

Leave a Reply